బాసరలో సైకో వీరంగం


Fri,March 22, 2019 03:22 AM

బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గురువారం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో రెండు కత్తులతో చొరబడి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఆలయ సిబ్బంది, హోంగార్డులు అదుపులోకి తీసుకొని బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రసాద్‌గౌడ్ ఇప్పటికీ నాలుగు సార్లు బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మొదటగా 2016 ఏప్రిల్‌లో అమ్మవారి సన్నిధిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా.. అప్పుడు గమనించిన పో లీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ స భ్యులకు అప్పగించారు. ఆ తర్వాత మరో రెండు సార్లు ఆలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించి చివరి క్షణం లో ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా.. గురువారం మళ్లీ ఆలయంలో చొరబడి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఇలా సదరు సైకో ప్రసాద్‌గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పా ల్పడుతుండడంతో పోలీసులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదేంటనీ అడిగితే తాను అమ్మవారి సన్నిధిలో చనిపోతే స్వర్గానికి వెళ్తాననీ, తనకు ఎవరూ లేరని ప్రసాద్ అన్నాడు.

శుభ దినాల్లోనే ఆత్మహత్యాయత్నం..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రసాద్ శుభ దినాలు, పండుగ దినాలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. గతేడాది మార్చి 21వ తేదీ (సరిగ్గా ఏడాది క్రితం)న ఆలయ ప్రాంగణంలో తన మణికట్టు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆ తర్వాత 2018 ఆగస్టు 11వ తేదీన కూడా ఆలయంలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. మళ్లీ మార్చి 21వ (గురువారం ) హోలీ పర్వదినాన ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో అధికారులు, హోంగార్డులు ఆయనను పోలీస్ స్టేషన్ తరలించారు. ఇంతకు ముందు ఆలయ గర్భగుడిలో చొరబడి కత్తితో గొంతుకోసుకునే యత్నం చేయగా అతన్ని కాపాడేందుకు ప్రయత్నించగా ఆలయ పూజారి, తాత్కాలిక ఉద్యోగికి గాయాలయ్యాయి. అప్పుడు కూడా చాకచక్యంతో సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ప్రసాద్‌గౌడ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

సాటాపూర్‌లో పోషణ్ అభియాన్ పక్షోత్సవాలు
రెంజల్ : మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ పక్షోత్సవంలో భాగంగా ని ర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. గురు వారం సాటాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే వారంతపు సంతలో కూరగాయలు, వ్యాపారుల క్రయ విక్రయాలపై పిల్లలతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సూపర్‌వైజర్ ప్రమీలారాణి తెలిపారు. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సూపర్‌వైజర్ పేర్కొన్నారు. కార్యక్ర మంలో అంగన్‌వాడీ టీచర్లు భాగ్య, గంగామణి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...