రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


Fri,March 22, 2019 03:21 AM

నందిపేట్ రూరల్ : నందిపేట్ మండలం వన్నేల్(కె) గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృ తి చెందినట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జక్రాన్‌సల్లి మండలం మునిపల్లి గ్రామాని కి చెందిన ట్రాక్టర్ డైవర్ దుర్గయ్య, నిజామాబద్ మండలం గుండారం గ్రామానికి చెందిన బత్తుల రమేశ్ ట్రాక్టర్‌పై ఆ ర్మూర్ నుంచి నందిపేట్ వస్తుండగా వన్నెల్(కే) గ్రామ శివా రులోని స్కూల్ వద్ద ఉన్న మలుపులో ప్రమాదవశాత్తు ట్రా క్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్‌పై కూర్చున్న రమేశ్(28) కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ దుర్గయ్య కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృ తుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని క్షత గాత్రుడిని దవాఖానకు తరలించి, మృతుడిని పోస్టుమారం ని మిత్తం జిల్లా దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

పండుగపూట గుండారంలో విషాదఛాయలు
నిజామాబాద్ రూరల్ : హోలీ పండుగ రోజు ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో రూరల్ మండ లంలోని గుండారం గ్రామంలో విషాదఛాయలు అలుముకు న్నాయి. గుండారం గ్రామస్తులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుండారం గ్రా మ నివాసి బత్తుల రమేశ్(27) అనే యువకుడు గ ల్ఫ్ దేశానికి వెళ్లి ఏ డాది క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అనంతరం ఆటో నడుపుకొంటూ జీవన సాగిస్తున్నాడు. బత్తుల ఎల్లయ్య, లక్ష్మి దంపతులకు చెందిన పెద్ద కొడుకు రమేశ్‌కు మెండోరా మం డలంలోని కొడిచర్ల గ్రామానికి చెందిన అనితతో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఆటో నడు పుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రమేశ్ హో లీ పండుగ రోజున తన బావ దుర్గయ్య నివాసం ఉంటున్న ఆర్మూర్‌కు వెళ్లాడు. కొత్తగా కొ నుగోలు చేసిన ట్రాలీని తీసుకొచ్చేందుకు వెళదామని బావ దుర్గయ్య, బావమరిది రమేశ్ ట్రాక్టర్‌పై గురువారం బయలు దేరారు. మార్గమధ్యలో వన్నెల్(కె) గ్రామ శివారులో మలు పు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ సంఘటనలో రమేశ్ ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందగా ట్రాక్టర్ నడుపుతున్న దుర్గయ్యకు తీవ్ర గాయాలు అయ్యా యి.

ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు బోరునవిలపిస్తూ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలివచ్చారు. గుండారం గ్రామ ఎంపీటీసీ అంకల గంగాధర్, సర్పంచ్ లక్ష్మణ్‌రావు, ఉప సర్పంచ్ శంకర్‌రెడ్డి, మండల రైతు స మన్వయ సమితి కో-ఆర్డినేటర్ బొల్లెంక గంగారెడ్డి, టీఆర్‌ఎస్ నా యకులు జమీర్‌ఖాన్, లయక్ తదిత రులు దవాఖానకు వచ్చి బాధిత కుటుంబీకులను పరా మర్శించి ఓదార్చారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...