ప్రజలంతా టీఆర్‌ఎస్ పక్షమే


Thu,March 21, 2019 12:54 AM

- పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ను దీవించాలి
- ఎంపీ కల్వకుంట్ల కవిత
- టీఆర్‌ఎస్‌లో చేరినకాంగ్రెస్, టీడీపీ నాయకులు
- మద్దతు ప్రకటించి విరాళాలు అందజేసిన పలు సంఘాలు

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్ ఎంపీగా రెండోసారి పోటీ చేస్తున్న ఎంపీ కల్వకుంట్ల కవితకు జిల్లాలోని పలు కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎన్నికల ప్రచార ఖర్చులకు తమవంతు ఆర్థిక సాయం చేసేందుకు విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని చెక్ రూపంలో ఎంపీ కవితకు అందజేశారు. బుధవారం ఎంపీ కార్యాలయంలో కవితను కలిసి కుల సంఘాల నేతలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తాము సేకరించిన విరాళాల మొత్తం రూ.4,47,948లను చెక్కు రూపంలో ఎంపీ కవితకు అందజేశారు. సీఎం కేసీఆర్ కుల వృత్తులుకు చేయూతనిస్తూ తమకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేస్తున్నారని ఈ సందర్భంగా సంఘాల నేతలు అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మీరు పడుతున్న శ్రమ, పట్టుదల చూస్తున్నామన్నారు. ఎంపీగా రెండోసారి గెలివపించుకుంటేనే మాకు తృప్తి అని, మా ఆడపడుచును మళ్లీ గెలిపించి పార్లమెంట్‌కు పంపుతామని పలు కుల సంఘాల నేతలు కవితతో అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలానా కరీమొద్దీన్‌తో పాటు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎంపీ గులాబీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో రెడ్‌కో చైర్మన్ ఎస్‌ఏ అలీం పాల్గొన్నారు.

ఎంపీ కవితకు మద్దతు ప్రకటించిన సంఘాలు...
నిజామాబాద్ పట్టణ యాదవ సంఘం, జిల్లా గుండ్ల, బెస్త కులస్తులు, జిల్లా మేదరి సంఘం, రజక ఐక్యవేదిక, శ్రీ గాండ్ల యువజన సంఘం, శ్రీ వాల్మీకి బోయ సంఘం, రజక సేవా సంఘం, ధర్పల్లి మాల సంఘం నాయకులు ఎంపీ కవితకు తమ మద్దతును ప్రకటించారు. జిల్లా వంజరి సంఘం రూ. 1.16 లక్షలు, నిజామాబాద్ క్షత్రియ (పట్కరి) సమాజ్ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానంతో పాటు రూ. 51వేలు, నగర గంగపుత్ర సంఘం ఏకగ్రీవ తీర్మానం చేస్తూ రూ. 41,150 వేలు, విరాళం చెక్కు రూపంలో అందజేశారు. టీటీఆర్ ఫౌండేషన్, నిజామాబాద్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ రూ.50,116, నిజామాబాద్ డాక్టర్స్ రూ.1.16 లక్షలు, నాయీబ్రాహ్మణ సేవా సంఘం గాజుల్‌పేట్ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఏకగ్రీవ తీర్మానం చేసి రూ.16,666 విరాళం అందజేసింది. గంగపుత్ర సంఘం జిల్లా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏకగ్రీవ తీర్మానం చేసి రూ. 25వేలు విరాళం ఇచ్చింది. జిల్లా వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించి రూ. 21వేలు, ఆదర్శ మున్నూరు కాపు సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేసి రూ. 11వేలు విరాళం అందజేశారు. ఆరెకటిక సంఘం రూ. 11వేలు, నిజామాబాద్ పాస్టర్స్ రూ. 20వేలు విరాళాలను చెక్కుల రూపంలో అందజేసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తనకు మద్దతు తెలపడమే కాకుండా ఎన్నికల ఖర్చు కోసం విరాళం ఇచ్చిన సంఘం నేతలకు ఈ సందర్భంగా ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...