సభ సక్సెస్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి కృషి


Wed,March 20, 2019 02:23 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : సీఎం కేసీఆర్ సభ సక్సె స్ కావడంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తనదైన శైలిలో కృషిచేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే సీఎం సభ ఇందూరులో తలపెట్టడంతో ఆయన పూర్తిగా సభను విజయవంతం చేయడం పైనే దృష్టిపెట్టారు. సభకు ఎనిమిది రోజుల ముందుగానే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సభ ఏర్పాట్లు, సంబంధిత సమీక్షల్లో లీనమయ్యారు. ఎనిమిది రోజుల పాటు జిల్లాలోనే ఉండి సభపై దృ ష్టి నిలిపారు. సభకు మూడు రోజుల ముందు నుంచే జిల్లా కేంద్రంలోనే మకాం వేశారు. జిల్లాలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల తో ఎప్పటికప్పుడు సమీక్షించారు. పలుమార్లు సభాస్థలిని, సభా ప్రాంగణ ఏర్పాట్లను ఎంపీ కవితతో కలిసి పరిశీలించారు. టీఆర్‌ఎస్ నాయకత్వానికి శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా సభకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా, వారు సభకు రావడానికి అవసరమైన అన్నీ ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించడం పై ప్రత్యేకంగా దృష్టి నిలిపి నాయకత్వానికి టార్గెట్లు నిర్దేశించారు. తన జన్మదినం రోజున కూడా సీఎం సభ ఏర్పాట్లపై ప్రత్యేకంగా కార్యకర్తలతో చర్చించారు. ఇదంతా చేస్తూనే తన బాల్కొండ నియోజకవర్గ నాయకులతో ఎంపీ కవితతో కలిసి సమీక్షలు నిర్వహించారు. సభా ఏర్పాట్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలను సైతం ఆయన దగ్గరుండి పరిశీలించి ఏర్పాట్లు చేయించారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు కీలకమో వివరిస్తూనే.. అందులో భాగంగా కేసీఆర్ సభను విజయవంతం చేయడం ఎందు కు అవసరమో వివరిస్తూ సభకు ప్రజలు తరలివచ్చేలా ఎంపీ కవిత తో కలిసి ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి... ఈ సభను విజయవంతం చేయడంలో అనుక్షణం కృషి చేశారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...