రైతుల ఊపిరి కేసీఆర్


Wed,March 20, 2019 02:23 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఎర్రజొన్న, పసుపు రైతులకు కేసీఆర్ అండగా నిలిచారు. ఎర్రజొన్న రైతులకు త్వరలో తీపి కబురు అందించబోతున్నట్లు ప్రకటించారు. వారికి తప్పకుండా న్యాయం చేస్తానని బహిరంగ సభ వేదికగా వెళ్లడించడంతో ఎర్రజొన్న రైతులకు ఎంతో ఊరట కలిగింది. అంతకు ముందు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎర్రజొన్న రైతులకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. రైతులకు మేలు చేసే విధంగా కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తారని తెలిపారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సభలో ఎర్రజొన్న రైతుల గురించి ప్రస్తావించి ప్రత్యేకంగా వారికి భరోసానిచ్చే విధంగా మాట్లాడారు.
త్వరలో ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలతో మాట్లాడి ఎర్రజొన్న రైతులకు న్యాయం చేయబోతున్నట్లు ప్రకటించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పసుపు రైతుల కోసం కూడా సీఎం మాట్లాడడం, ఆ రైతులకు కొత్త ఊపిరినిచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు ఆగమాగం చేస్తే మీరు ఆగం కావొద్దంటూ హితబోధ చేస్తునే పసుపు రైతుల మేలు కోసం, గిట్టుబాటు ధర కోసం పసుపును తెలంగాణ బ్రాండ్ పేరుతో మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా ఎగుమతి చేసే ప్రణాళికలు చేస్తున్నామని ప్రకటించడం పసుపు రైతుల్లో కొండంత ధీమాను పెంచింది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...