ప్రైవేటు దవాఖానలో సెల్‌ఫోన్ దొంగలు


Wed,March 20, 2019 02:20 AM

నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని ప్రై వేటు దవాఖానలో నిత్యం వైద్య పరీక్షల ని మిత్తం వచ్చే జనం, రోగుల సంఖ్య పెరిగిపోతోంది. దానికి తగ్గటుగానే వాహనాల దొంగలు, సెల్‌ఫోన్ తస్కరించే వారు తమ చేతి వాటని ప్రదర్శిస్తున్నారు. స్థానిక ఒక టో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖలీల్‌వాడీ ప్రాంతంలో ప్రైవేటు దవాఖానలు చాలా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య సైతం విపరీతంగా ఉంటోంది. దీన్ని అదనుగా చే సుకొని పలు ముఠాలకు చెందిన దొంగలు తరుచూ చోరీలకు పాల్పడుతున్నారు. అడ పాదడపా దవాఖానల వద్ద నిలిపిఉంచిన ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్ దొంగలు సైతం దవాఖానలో తిరుగుతూ తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇ లాంటి సెల్‌ఫోన్ చోరీ సంఘటనలు ఇప్ప టి వరకు చాలా జరిగినప్పటికీ అవి బయటపడలేదు.
రెండు రోజుల క్రితం స్థానిక సరస్వతి నగర్ ప్రాంతంలో ఉన్న చిన్న పిల్లల దవా ఖాన కు వైద్య పరీక్షల నిమిత్తం వచ్చినట్లు ద వాఖాన వర్గాలను నమ్మించిన ఓ జంట అ క్కడ టెబుల్‌పై పెట్టి ఉన్న సెల్‌ఫోన్‌ను దొం గిలించుకొని అక్కడి నుంచి పరార య్యా రు. అయితే వారు చేసిన ఈ నిర్వాకం అం తా దవాఖానలో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...