తెలంగాణ అభివృద్ధి దేశానికి దిక్సూచి


Tue,March 19, 2019 03:07 AM

-జాతీయ స్థాయిలో మంచి నాయకత్వం అవసరం
-వందల సార్లు మాట మార్చిన బీజేపీ
-రాహుల్ గరీబీ గురించి మాట్లాడడం విడ్డూరం
-మీడియాతో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: తె లంగాణ అభివృద్ధి నమూనా దేశానికి దిక్సూచిగా మారిందని, దీనిని దేశవ్యాప్తం చేసేందుకు ఈ పా ర్లమెంట్ ఎన్నికల్లో పదహారు స్థానాలు టీఆర్‌ఎస్ గెలవాల్సిన అనివార్యత ఉన్నదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అ న్నా రు. సభా వేదిక పరిశీలన అనంతరం సోమ వా రం ఎంపీ మీడియాతో మాట్లాడారు. పదహారు మంది ఎంపీలు మనకుంటే మనతో కలిసికట్టుగా వచ్చేవాళ్లు ఎంతో మంది ఉన్నారని, అందరినీ కలుపుకొని తెలంగాణ అభివృద్ధి నమూనాను రేపటి నాడు దానిని దేశవ్యాప్తం చేస్తామన్నారు. ఇన్ని రోజులు గుజరాత్ మాడల్ అని చెప్పేవారని, ఐదు సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రే ప్రధానమంత్రి అయినా తెలంగాణ మాడల్ అం టున్నారని కానీ గుజ రాత్ మాడల్ అనడం లేరని అన్నారు. తెలంగాణ మాడల్ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేది ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా మన రైతుబంధు పథకాన్ని వారు కాపీ కొట్టి పెట్టుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు నిజామాబాద్ పార్లమెంటరీ ని యోజకవర్గాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. నాయకులందరూ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని తెలిపారు. ప్రజలందరూ కూడా సీఎం కేసీఆర్ ప్రసంగం వినడానికి, చూడడానికి స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నగరంలోని గిరారాజ్ కాలేజ్ మైదానంలో సాయం త్రం 4గంటలకు సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

వందల సార్లు మాట మార్చిన బీజేపీ..
జాతీయ స్థాయిలో కేసీఆర్ లాంటి నాయక త్వం అవసరమున్నదని కవిత తెలిపారు. బీజేపీ ఎన్నో మాటలు చెప్పి ఐదేండ్ల కింద కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, భారతీయ జనతా పార్టీ ఐదేండ్లలో ఏం మార్చిందని అంటే ఒకసారి నోట్లు మార్చారని, ఒకసారి ట్యాక్స్ మార్చారని, వందల సార్లు మాట మార్చారని ఎద్దేవా చేశారు. ప్రజలకే కాదు ఆఖరికి దేవుడికే టోపీ పెట్టే పార్టీ బీజేపీ అన్నారు. నిజంగా భగవంతుడు శ్రీరామ చంద్రుడు అనుకుంటున్నాడంట.. అంతకు ముం దు నేను ఒకేసారి పద్నాల్గు ఏండ్లు వన వాసం చేసి న, కానీ ఈ భారతీయ జనతా పార్టీ పాడు గానూ ఎన్నికలు వచ్చినప్పడే తప్ప మిగతా ఎప్పుడూ నాకు వనవాసమేనని రామచంద్రుడు అనుకుంటుండంట అని బీజేపీ నాయకత్వాన్ని విమర్శించారు. బీజేపీ దేశభక్తి అని మొత్తుకుంటున్న దని, మొన్న పుల్వామాలో అటాక్ జరిగితే ప్రతి సైనికుడికి రూ. 25లక్షలు ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని అన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎంత మంది ముఖ్య మంత్రులు సైనికులను ఆదుకొనేలా చర్యలు తీసుకున్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని కోరారు.

రాహుల్ గరీబీ గురించి మాట్లాడడం విడ్డూరం
కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఈ దేశాన్ని పాలించిన పార్టీ అని, ఇందిరమ్మ ఉన్నప్పుడు నుంచి గరీబీ హటావో అని చెబుతున్నారని, ఇవాళ ఇందిరమ్మ మనువడు (రాహుల్‌గాంధీ) వచ్చి అదే గరీబ్ వాళ్లకు నెలకు డబ్బులిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని కవిత విమర్శించారు. అంటే గరీబీ ఇంత వరకు పోలేదని అర్థం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ వాళ్ల నాన్నమ్మ కాలం నుంచి మనుమడు కాలం వరకు పాలన చేస్తే ఇంత వరకు పేదరికాన్ని కాంగ్రెస్ నిర్మూలించలేదన్నారు. అదే తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం రూ. 40వేల కోట్లను సంక్షే మానికి ఖర్చు చేస్తుందని చెప్పారు. పేదవా రెవ్వరూ ఆకలితో పడుకోకుండా బియ్యం ఇచ్చే కోటాను కూడా పెంచి అన్ని రకాలుగా పేదవాళ్లకు ఆదుకొనేలా మంచి కార్యక్రమాలను చేస్తున్నామని అన్నారు. దేశ, జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు ఈ కార్యక్రమాలు చేయడం లేదనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు. అమెరికా నుంచి మనదగ్గరకి రావాలనుకొనే రోజులు రావాలని, ఇండియా నుంచి అమెరికా వెళ్లి ఉద్యోగాలు వెతుక్కునే రోజులు పోవాలని కవిత అన్నారు. అటువంటి రోజులు రావాలంటే మంచి నాయకత్వమున్న నాయకుడు ఉండాలని, దేశస్థాయిలో జరిగేటటు వంటి నిర్ణయాలను ప్రభావితం చేసే నాయకత్వం ఉండాలని, ఆ నాయకత్వం ఇవాళ తెలంగాణ గడ్డ దేశానికి అందించిందన్నారు. సీఎం కేసీఆర్ నాయ కత్వాన్ని బలపరుస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పదహారుకు పదహారు పార్లమెంట్ సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ప్రజల ను కోరుకుంటున్నానని అన్నారు.

కళకళలాడుతున్న తెలంగాణ పల్లెలు..
తెలంగాణలో ఎటువంటి మార్పు అయితే చూ స్తున్నామో, అంతకు ముందు ఎండిపోయిన మన చెరువులు ఇప్పుడు కళకళలాడుతున్నాయని కవిత అన్నారు. అంతకు ముందు ఊర్లళ్లో కరెంట్ ఉండకపోతుండేనని, ఇప్పుడు 24 గంటలు నిర్వి రామంగా ఉంటుందని తెలిపారు. రైతన్నలకు ఇంత పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయని, నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూస్తే పట్టుబట్టి, వెంటబడి మనం సాగునీటిని ఇచ్చే సంఖ్యను పెంచుకున్నామని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మనం చెప్పి న ప్రతి ఒక్క మాట కూడా తుచా తప్పకుండా బడ్జెట్‌లో పెట్టుకున్నామన్నారు. నిరుద్యోగ యువ తి, యువకులందరికీ భృతి ఇస్తామని సీఎం కేసీ ఆర్ చెప్పారని, దానికి సంబంధించి నెలకు రూ. 3వేలు ఇవ్వడానికి రూ.2800 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని తెలిపారు. ఏప్రిల్ లేదా మే ఒకటో తారీఖున తప్పకుండా పెరిగిన పింఛన్ ప్రతి ఒక్కరికీ అందుతుందన్నారు. బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ తీసేస్త్తామని చెప్పామని, పీఎఫ్ కార్డుంటే చాలు బీడీ కార్మికులందరికీ రూ.2వేల పింఛన్ రాబోతున్నదని అన్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనతో లబ్ధి..
రాష్ట్రంలో రైతుబంధు పథకం ఇచ్చేకన్నా ముందు భూరికార్డుల ప్రక్షాళన చేసి, రికార్డులన్నీ సరిచేసి, సవరించి రైతుల గు రించి ఈ పథకాన్ని అమలు చేశామని కవిత అన్నారు. దీంతో రైతులకు నేరుగా బెనిఫిట్ అందుతున్నదని తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో లేదా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇంత వరకు భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదని తెలిపారు. లోక్‌పాల్ పెడతామని, లోక్‌పాల్ ఏర్పాటు చేస్తామని అధికారంలోకి రాకముందు చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు ఎలక్షన్స్ రాగానే లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడ తామని ప్రకటన చేశారని తెలిపారు. దీనిపై ప్రజలు ఆలోచించాలని అన్నారు.

జాతీయ స్థాయిలో మంచి నాయకత్వం అవసరం
దేశ, జాతీయ స్థాయిలో ఒక మంచి నాయ కత్వం అవసరమున్నదని దేశ ప్రజలందరూ భావిస్తున్నారని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరవై ఏండ్లకు పైగా రాజ్యం చేసిందని, భారతీయ జనతా పార్టీ పదేండ్లకు పైగా పాలించిందని, అంతో ఇంతో ఓ ఐదేండ్లు ఇతర పార్టీలు ఉన్నాయని అన్నారు. మొత్తం భారతదేశం ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారణం కాంగ్రెస్, బీజేపీ పా ర్టీలన్నది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. తె లంగాణ పల్లెలో ప్రతి ఒక్క ఇంటి నుంచి అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వెళ్లిన వాళ్లో, మరీ ప్రత్యేకించి గల్ఫ్ దేశాలకు వలసపోతున్న వారెందరో ఉంటారని, ఆ దేశంలో 24 గంటలు కరెం ట్, 24 గంటలు తాగునీళ్లు తదితర సౌకర్యాలు ఉంటాయని, అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు ఎంతో ఆశ్చర్యంగా చెబుతుంటారని అన్నారు. మన తెలంగాణలో, మన పల్లెల్లో 24 గంటల కరెంట్, 24గంటల నీళ్లు ఉంటాయని అని చెప్పుకొనే పరిస్థితిని మనం సాధించుకో గలిగామన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...