కార్మికులకు బీమా చేయించాలి


Tue,March 19, 2019 03:05 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : పలు విభాగాల్లో పనిచేసే కార్మీకులందరికీ తప్పకుండా బీమా చేయించాలని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ చతుర్వేది అన్నారు. సోమవారం ఆయన ఆర్మూర్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం ప్రవేశపెట్టిన బీమా సౌకర్యాలను సద్వినియోగపర్చుకోవాలన్నారు. కార్మికశాఖలో రెండు బోర్డులున్నాయని, ఒకటి తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి కాగా, రెండోది తెలంగాణ భవన నిర్మాణ మండలి అన్నారు. తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి కింద దుకాణాల్లో, సొసైటీల్లో, పెట్రోల్ పంపుల్లో, సినిమా థియేటర్లలో, వాహనాల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు వస్తారని, వీరికి బీమా చేయించడానికి కార్మికులు రూ.2ను, యాజమాన్యం రూ. 5ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ భవన నిర్మాణ మండలి విభాగంలో సభ్యత్వం తీసుకునే కార్మికులు అడ్మిన్ ఫీజుగా రూ. 50ను, ఐదేళ్ల కోసం రూ. 60 చెల్లించాలన్నారు. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న కార్మికులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. బీమా చేయించుకున్న కార్మికుల సహజ మరణానికి రూ. లక్ష, అంత్యక్రియలకు రూ. 30వేలు, ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. 6లక్షల ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో న్యాక్ ద్వారా కార్మికులకు వృత్తి నైపుణ్యం కింద శిక్షణని స్తామన్నారు. కార్మికులు తప్పకుండా ఐదేళ్లకొకసారి తప్పకుండా వారి సభ్యత్వాలను రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. రెన్యూవల్ చేయించుకోని కార్మికులకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అందవన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...