ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్


Tue,March 19, 2019 03:04 AM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నాగారంలోని రాజారం స్టేడియంలో పోలీస్ కమిషనర్ కార్తీకేయ పర్యవేక్షణలో సబ్ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరదారుఢ్య పరీక్షలు సోమవారం ముగిశాయి. 13 రోజులుగా నిర్వహిస్తున్న ఈవెంట్స్ సోమవారం చివరి రోజు కావటంతో ఉదయం 5గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ పరీక్షకు 1,000 మంది పురుష, మహిళా అభ్యర్థులను పిలువగా 955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం నుంచి అభ్యర్థుల ఎత్తు, ఛాతీ చుట్టు కొలతలలో అర్హత పొందిన వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థుల ప్రతిభకు సంబంధించిన ఫలితాల స్కోర్ షీట్‌ను అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా tslprb.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ విధానం ద్వారా అభ్యర్థుల ఈవెంట్స్ ప్రక్రియ ముగిసిన తరువాత తమ దేహదారుఢ్య పరీక్ష ఫలితాలు రిక్రూట్‌మెంటు బోర్డ్ సర్వర్‌లో అప్‌లోడ్ కావడానికి సాయంత్రం అవుతుందని దానిని మరుసటి రోజు డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఈ ఎంపిక సమయంలో నిజామాబాద్ అదనపు డీసీపీ ఎం.శ్రీధర్ రెడ్డి, ట్రెయినింగ్ ఐసీఎస్ గౌస్ ఆలం, ఆర్మూర్, బోధన్, ఎన్‌ఐబీ, ఎఆర్, ట్రాఫిక్, సీసీఎస్, ఏసీపీలు ఎ.రాములు, ఎ.రఘు, జి.రాజారత్నం, సీహెచ్.మహేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావ్, టి.స్వామి, కామారెడ్డి ఏఆర్‌డీఎస్‌పీ జి.శ్రీను, బాన్స్‌వాడ డీఎస్పీ యాదగిరి, ఏవో సత్యకుమార్, అన్ని సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, సూపరింటెండెంట్‌లు శ్రీనివాస్, మహ్మద్ మక్సుద్ హైమద్, జనార్దన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌ప్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఈ సాప్ట్ ఇన్‌చార్జి కె.వంశీ చక్రవర్తి, రిజర్వు ఇన్‌స్పెక్టర్స్, ఫిజికల్ డైరెక్టర్స్ చంద్ర ప్రకాశ్, స్వప్న, పీఈటీలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...