నామినేషన్ల పర్వం ప్రారంభం


Tue,March 19, 2019 03:04 AM

నిజామాబాద్ సిటీ: పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అధికార యంత్రాంగం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ నియమ నిబంధనలతో కూడిన అంక్షలను విధించింది. కలెక్టరేట్ ప్రవేశద్వారంలోనే లోనికి ప్రవేశించి వారి పూర్తి వివరాలను సేకరిస్తూ అర్హులైన వారిని మాత్రమే లోనికి అనుమతించింది. అయితే సోమవారం తొలిరోజు నామినేషన్‌లు వేయలేదు. ఇప్పటి వరకు స్వతంత్ర అభ్యర్థులు గానే బరిలోకి దిగే ఆలోచనలతో అభ్యర్థులు ఉన్నారు. ఇందులో భాగంగా బాల్కొండ, మోర్తాడ్ ప్రాంతాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఎర్రజొన్న, పసుపు రైతుల కష్టాలను పట్టించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన పంటలైన ఈ రెండు పండించే రైతులు ఈ సారి తమకు న్యాయం జరుగాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. మూకుమ్మడిగా చిన్న గ్రామాల నుంచి నలుగురు, పెద్ద గ్రామాల నుంచి పది నుంచి పన్నెండు మంది అభ్యర్థులు పోటీ చేస్తామని తీర్మానించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ఈ రెండు ప్రధాన పంటలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసినప్పటికీ రైతులు పడ్తున్న కష్టాలను గుర్తించని కేంద్ర ప్రభుత్వ వైఖరిని తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకున్నట్లు వారు నినదిస్తున్నారు. సోమవారం దరఖాస్తులు ఫారాలను స్వీకరించిన అభ్యర్థులు నియమావళిని అనుసరించి అందులోని అన్నీ అంశాలు పూర్తి చేసి మరో రెండ్రోజుల్లో నామినేషన్ వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కలెక్టరేట్ ప్రాంగణం ఈ అంక్షలతో నిర్మానుష్య వాతావరణం సంతరించుకున్నది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు మినహా ఇతరులను లోనికి అనుమతించడంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. అభ్యర్థులు, మీడియా కోసం ఆఫీసర్స్ క్లబ్‌లో టెంట్, కుర్చీలు, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసుశాలోని 11 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 24 మంది సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు కలెక్టరేట్‌లోని అన్ని ప్రవేశ ద్వారాల వద్ద గట్టి భద్రత ఏర్పాట్లలో ఉన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పరిస్థితులను చక్కబెడుతోంది.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...