చెట్టును ఢీకొని యువకుడి మృతి


Tue,March 19, 2019 03:04 AM

నిజామాబాద్ రూరల్ : రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముత్తకుంట గ్రామ శివారులో ఆదివారం రాత్రి ఒక యువకుడు తన తల్లితో కలిసి బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి చెట్టు ను ఢీకొనగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో తల్లి బయట పడింది. ఎస్‌హెచ్‌వో ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముత్తకుంట గ్రామానికి చెంది న అర్జున్ తన తల్లి లక్ష్మితో కలిసి ఆదివారం బైక్‌పై నిజామాబాద్ నగరంలో ఓ శుభకార్యానికి బయల్దేరి వెళ్లారు. శుభకా ర్యం జరిగిన అనంతరం అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ముత్తకుంట గ్రామశివారులో ప్ర మాదవశాత్తు బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ సం ఘటనలో యువకుడి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్వల్పగాయాలతో తల్లి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సంఘటన సమాచారాన్ని తల్లి కుటుంబ సభ్యులకు అందించింది. కుటుంబ సభ్యులందరూ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని ప రిశీలించి శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి కుటుంబీకుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపా రు. అర్జున్‌కు ఇంకా వివాహం కాలేదు. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అ లుముకున్నాయి.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...