బోధన్ రైల్వేగేట్ వద్ద ట్రాఫిక్ జామ్


Sun,March 17, 2019 03:28 AM

శక్కర్‌నగర్ : బోధన్ పట్టణంలోని రైల్వేగేట్ ప్రాంతం నిత్యం రద్దీగా మారుతోంది. దీనికి తోడు ఏదైనా రైలు వస్తే గేటు పడిన సమయంలో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. శనివారం మధ్యాహ్నం గూడ్స్ రైలు రావడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి, వాహనాలు అడ్డదిడ్డంగా రైల్వేగేట్‌కు ఇరువైపులా నిలిపివేయడం, అదే సమయంలో పదో తరగతి పరీక్షలు రాసి విద్యార్థులు వచ్చే సమయం కావడంతో, వాహనాల రద్దీ కన్పించింది. దీంతో గూడ్స్ రైలు వెళ్లిపోయినా సుమారు అరగంటకు పైగా వాహనాలు బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. సమాచారం అందిన వెంటనే బోధన్ ఏఎస్సై రవీందర్ గుప్తా, పోలీసులతో అక్కడకు వచ్చి వాహనాల రాకపోకలను నియంత్రించారు. సుమారు ముప్పావుగంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.

రైల్వేగేట్ ద్వారా రాక పోకలు ప్రారంభం
ఎడపల్లి : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ రైల్వేగేట్ ద్వారా శనివారం వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. రెండు రోజులుగా మరమ్మతు పనులు జరగడం తో గేటును మూసి ఉంచగా ఈ గేట్‌కు శనివారం మరమ్మతు పను లు పూర్తి కావడంతో ఈ రైల్వేగేట్‌ను తెరిచారు. ఈ మార్గం గుండా న వీపేట్, బాసర్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు శనివారం సా యంత్రం నుంచి ప్రారంభమయ్యాయి.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...