తాగునీటి సమస్యను పరిష్కరించండి


Sun,March 17, 2019 03:27 AM

శక్కర్‌నగర్ : బోధన్ పట్టణంలోని 32వ వార్డులో తా గునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ శనివారం ఉదయం స్థానిక కాలనీ వాసులు పట్టణంలోని మా రుతీ మందిరం వద్ద రోడ్డుపై రాస్తారోకో చేశారు. తమ కాలనీకి తాగునీటి సౌకర్యం కోసం కేవలం ఒకే చేతిపంపు ఉందని, ఆ చేతిపంపులో నీరు సరిగా రావడం లేదని పలుమార్లు కౌన్సిలర్‌తో పాటు, మున్సిపల్ అ ధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపి స్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అం దిన వెంటనే పోలీసులు, మున్సిపల్ కమిషనర్ అజ్మీ రాస్వామి నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని కా లనీవాసులతో మాట్లాడారు. కాలనీలో ఉన్న బోరు ను రిపేర్ చేయిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసుల ఆందోళన విరమించారు. బో రు రిపేర్ చేసినా ప్రయోజనం లేకుంటే, ట్యాం కర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని కాలనీవాసులకు కమిషనర్ హామీ ఇచ్చారు.

పాన్‌గల్లీలో..
పాన్‌గల్లీలో ఉన్న బోరును పనిచేయకుండా కాలనీకి చెందిన కొందరు విద్యుత్ సరఫరాను తొలగించారని, ఈ బోరును పనిచేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కాలనీకి చెందిన రాజుయాదవ్‌తో పాటు పలువురు మున్సిపల్ కమిషనర్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పాన్‌గల్లీ వాసులతో పాటు, టీఆర్‌ఎస్ నాయకుడు గుండేటీ రాములు ఉన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతాం..
బోధన్ పట్టణంలో వేసవి కాలం సందర్భంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని, ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ అజ్మీరాస్వామి నాయక్ కోరారు. పట్టణంలోని 32వ వార్డుతో పాటు, పాన్‌గల్లీలో ఏర్పడిన సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ శాఖ ఏఈలను అప్రమత్తం చేసామని ఆయన వెల్లడించారు

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...