అవయవదానానికి ముందుకు రావాలి


Mon,February 18, 2019 02:38 AM

ఇందూరు: అవయవదానంతో మరణించిన తర్వాత కూడా ఇతరులకు పునర్జన్మ ఇవ్వొచ్చని, అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని జిల్లా ప్రభుత్వ దవాఖాన ఇన్‌చార్జి సూపరింటెండెంట్ జలగం తిరుపతిరావు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి, టీ న్యూస్, నమస్తే తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివా రం నగరంలోని టీఎన్జీవోస్ భవన్‌లో అవయవదాన సం కల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనలతో అవయవదానానికి ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ కృషిని కొనియాడారు. సీఎం కేసీఆర్ చొరవ చూపి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స ముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని ఒడిసి పట్టే బృహత్తర కార్యక్రమంతో తెలంగాణను సశ్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఇప్పటికే లక్షల మం ది లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రజలు తమ అపోహాలను వీడి అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చా రు. అనంతరం అవయవదానం చేద్దామనుకునే వారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన అవయవదాన సం కల్ప కార్యక్రమం సరైన వేదిక అని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ అన్నారు.

సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భం గా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినంద నీయమన్నారు. అవయవదాన సంకల్పం మహోన్నత కార్యక్రమమని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భవిష్యత్తులో తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. మరణానంతరం మన అవయవాలను దానం చేస్తే ఇతరులకు పునర్జన్మ ఇచ్చిన వారమవుతామని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు అన్నారు. అవయవదానంతో ఇతరులకు మేలు చేసిన వారిమవుతామన్నారు. సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత శ్రీ కారం చుట్టగా జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్, నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్‌చార్జి శ్రీనివాస్, టీన్యూస్ స్టాఫర్ పంచరెడ్డి శ్రీకాంత్, నూకల విజయ్‌కుమార్, దర్శనం దేవేందర్, పంచరెడ్డి మురళి, పులి జైపాల్, రాజేశ్‌యాదవ్, పోల హరిప్రసాద్, జాగృతి మహి ళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అపర్ణ, శ్రీనివాస్‌గౌడ్, రంజిత్‌రావు, సుకుమార్, రజిత, పద్మ, గోపాల్, కొట్టూరు నర్సింహులు, రమేశ్ రావు, భాస్కర్, శ్రీకాంత్ నాయక్, రాజేశ్వర్ రాజు, రంజిత్, సంతోష్, విక్కీ, సంపత్, క్రాంతి, సాయి, గణేశ్, సందీప్, కుల్‌దీప్, హరీశ్, దశరథ్, అజయ్, గుత్ప ఆంజనేయులు, కొయ్యాడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...