ఇందూర్ బాలికలకు రాష్ట్రస్థాయి బేస్‌బాల్ చాంపియన్‌షిప్


Mon,February 18, 2019 02:38 AM

నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్రస్థాయి బేస్‌బాల్ చాంపియన్‌షిప్‌ను ఇందూర్ బాలికలు కైవ సం చేసుకున్నారు. జగిత్యాల్ జిల్లాలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థా యి జూనియర్ బేస్‌బాల్ చాంపియన్‌షిప్ ఆదివారం తో ముగిసింది. రాష్ట్రవ్యాప్తం గా ఉన్న వివిధ జిల్లాల నుం చి పాల్గొన్న జట్లలో నుంచి హైదరాబాద్, నిజామాబాద్ జట్లు తుదిపోరులో తలపడ్డాయి. వరుస విజయాలతో దూసుకొచ్చిన ఈ రెండు జ ట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జి ల్లా బాలికలు దూకుడుగా ఆడి ఏకపక్షంగా విజయం దిశగా పయనించారు. అయితే ఆట ముగిసే సమయానికి 1-9 పరుగుల తేడాతో ఒంటి చేత్తో విజ యం సాధించి తెలంగాణ రాష్ట్ర బేస్‌బాల్ చాంపియన్లుగా నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమానికి జగిత్యాల్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ ముఖ్యఅతిథిగా హా జరై విజేతలకు చాంపియన్‌షిప్ ట్రోఫీని బహుకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీ త, కోశాధికారి చిన్నికృష్ణ, సంయుక్త కార్యదర్శి ఆశీ ష్ నాయక్ పాల్గొన్నారు. జిల్లా జట్టుకు సంఘం కా ర్యదర్శి నరేంద్ర చారి, సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి గంగామోహన్, రాజేశ్‌లు కోచ్ కం మేనేజర్లుగా వ్య వహరించారు. జిల్లా జట్టు విజయం సాధించడంపై ఒలింపిక్ సంఘం చైర్మన్ గడిల శ్రీరాములు, కన్వీనర్ డి.సాయిలు, సాఫ్ట్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షు డు ప్రభాకర్‌రెడ్డి, వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షు డు మల్లేశ్‌గౌడ్‌లు విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...