రోడ్డెక్కిన రైతన్న


Sun,February 17, 2019 03:17 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : పసుపు, ఎర్రజొన్న పం టలను ప్రభుత్వమే కొనుగోలు చేసి, మద్దతు ధర చె ల్లించాలని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. ఆ ర్మూర్ మండలం పెర్కిట్‌లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై వెంకటేశ్వర గార్డెన్, శ్రావణ్‌గార్డెన్ వద్ద రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర చెల్లించాలని ఇదివరకు ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తా వద్ద రెండు మార్లు ధర్నా నిర్వహించారు. రెండు మార్లు రాస్తారోకో చేపట్టినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శనివారం రైతులు వేర్వేరు చోట్ల రోడ్ల దిగ్భం ధాన్ని చేపట్టి అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. ఉదయం 11గంటలకు రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో ప్రారంభించి వంటావార్పును రోడ్డుపైనే చేసి నిరసన తెలిపారు. అక్కడే రైతులందరూ భోజనం చేశారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

రైతు లు ధర్నా చేసే ప్రాంతాలకు దూరంగానే బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. జిల్లాతో పాటు మెదక్, సిద్దిపేట్, సం గారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన పోలీసులు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. సీపీ కార్త్తికేయ శాంతిభధ్రతలకు విఘాతం కలిగించవద్దని రైతులను కోరారు. రాత్రి ఏడు గంటలకు దాటినా జా తీయ రహదారిని రైతులు వీడలేదు. రాస్తారోకో వీడాలని సీపీ కార్త్తికేయ రైతులకు సూ చించగా.. వారు ససేమిరా అన్నారు. కలెక్టర్ వచ్చి సమస్యపై కచ్చితమైన హామీ ఇచ్చేవరకు రాస్తారోకో కొనసాగిస్తామని సీపీతో రైతులు అ న్నారు. నిరసనలో రైతు నాయకుడు అన్వేశ్‌రెడ్డి, రైతు లు గంగారాం, హేమంత్‌రెడ్డి, సుర్బిర్యాల్ మోహన్, పిప్రి గంగారెడ్డి, నక్కల భూమన్న, రైతులు పాల్గొన్నా రు. అదనపు సీపీ శ్రీధర్, నిర్మల్ ఏఎస్పీ శశిధర్, ఆ ర్మూర్ ఏసీపీ అందె రాములు, ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో రాఘవేందర్, ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు.

168
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...