కబ్జా పై స్పందించిన కలెక్టర్


Sun,February 17, 2019 03:16 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : మానిక్‌బండార్ గ్రామ శివారులో బ్లూమింగ్ బడ్స్ స్కూల్ యాజమాన్యం ఇరిగేషన్‌కు చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని రోడ్డు వేసుకొని వాడుకుంటుడడంపై వచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు స్పందించారు. ఈ భూమి ఆక్రమణపై నమస్తే తెలంగాణ టాబ్లాయిడ్‌లో ఫూలాంగే ఆ స్కూల్‌కు రోడ్డు అనే శీర్షికన శనివారం కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఇదే స్కూల్ యాజమాన్యం సుభాష్‌నగర్ (న్యూ ఎన్జీవోస్ కాలనీ)లో మున్సిపల్ కార్పొరేషన్ పార్కుకు చెందిన కోట్లాది రూపాయల స్థలాన్ని కబ్జా చేసిన విషయాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. జిల్లా యంత్రాంగం స్పందించి దాన్ని ఆధీనంలోకి తీసుకున్నది. తాజాగా ఇదే యాజమాన్యానికి చెందిన మరో కబ్జా పర్వం వెలుగు చూసింది. దీనిపై కలెక్టర్ జాయింట్ సర్వేకు ఆదేశాలిచ్చారు. శనివారం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, మాక్లూర్ తహసీల్దార్ ప్రసాద్, గిర్దావర్, వీఆర్వో, ఇరిగేషన్ అధికారులు వచ్చి ఈ సర్వేలో పాల్గొన్నారు. నివేదికను ఆర్డీవోకు సమర్పిస్తామని అధికారులు తెలిపారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...