భార్యను కడతేర్చిన భర్త


Sun,February 17, 2019 03:16 AM

ఇందల్వాయి : మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున కుంట విజయ (45) అనే వివాహిత ఆమె భర్త కుంట గంగబాబు చేతిలో దారుణ హత్యకు గురైంది. డిచ్‌పల్లి సీఐ రామాంజనేయులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధర్పల్లి మండలం వాడీ గ్రామానికి చెందిన గంగబాబు 15 ఏళ్ల కింద బతుకు దెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి నాలుగు నెలల క్రితం స్వదేశానికి వచ్చాడు. తన భర్త గంగబాబు 15 ఏళ్లుగా గల్ఫ్‌లోనే ఉండడంతో కుంట విజయ తన తల్లిగారి ఊరైన ఎల్లారెడ్డిపల్లిలో చిన్న ఇల్లు ఖరీదు చేసుకుని అక్కడే నివాసముంటున్నది. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంలో ఉన్న గంగబాబు రోకలి దొడ్డుతో తన భార్య విజయ తలపై గట్టిగా బాదాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం గంగబాబు ఇంటికి తాళం వేసి పరారీ అయ్యాడు. శనివారం ఉదయం 9 గంటలు అయినా ఇంటి తలుపులు తెరవకపోవడంతో విజయ తల్లి వచ్చి చూసింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనుక భాగంలోని కిటికీ నుంచి చూడగా విజయ రక్తపు మడుగులో కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ రామాంజనేయులు సిబ్బందితో కలిసి ఎల్లారెడ్డిపల్లిలోని మృతురాలి ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. విజయకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్, ప్రశాంత్ ఉన్నారు. వీరిద్దరూ గల్ఫ్‌లో ఉన్నారు. విజయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...