సాంకేతిక పరిజ్ఞానానికి వర్క్‌షాప్ దోహదం


Sat,February 16, 2019 02:39 AM

ఎల్లమ్మగుట్ట : ఎంతో విలువైన పరికరాలు సాంకేతిక పద్ధతులను ఈ వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులు స్వయం గా ఉపయోగించే అవకాశం కలుగుతుందని తెలంగా ణ విశ్వవిద్యాలయ డీన్ ప్రొఫెసర్ విద్యావర్ధిని సూచించారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన వృక్ష, జీవ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో టెక్నిక్స్ ఇన్ బయోటెక్నాలజీ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యశాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇటువంటి సాంకేతిక అవకాశాలను స్వయంగా తెలుసుకునేలా దోహదపడుతుందన్నారు. ఇందులో విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో ప్రయోగాలను చేస్తూ వారిలో మరింత ఆలోచింపజేసే శక్తితో పాటు ప్రావీణ్యత మెరుగవుతుందని ఆమె తెలిపారు.

ఇలాంటి అవకాశాలను వి ద్యార్థులు సద్వినియోగం చేసుకుని అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ప్రయోగశాల లో విద్యార్థులతో వివిధ ప్రయోగాలను చేయించారు. దీంతో వచ్చే ఫలితాలను వివరించారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ దుబ్బరాజం, హైదరాబాద్‌కు చెందిన ప్రైమర్ బ యోటెక్ సంస్థ నుంచి శా స్త్రవేత్తలు గాజుల రాజేశ్‌గౌడ్, చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, కన్వీనర్ లత, సహకన్వీనర్ దీపక్ పరమార్, కోఆర్డినేటర్ రవిరాజ్, సభ్యులు గోపాల్, బి.లత, డాక్టర్ నర్సింహాస్వామి, డాక్టర్ సురేశ్, అమ్రిన్ ఆరా, నవ్యజ్యోతి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, వైస్‌ప్రిన్సిపాల్ అంకం గంగాధర్, పరీక్షల నిర్వహణ అధికారి వేణుప్రసాద్, యూజీసీ కోఆర్డినేటర్, పీవీవీ వరప్రసాద్, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది, 60 మంది విద్యార్థులు తదితరు లు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...