సుడిగాలి పర్యటన


Fri,February 15, 2019 12:45 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి జిల్లాకు విచ్చేసిన ఎంపీ కల్వకుంట్ల కవిత వివిధ కార్యక్రమాలు, సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం 11గంటల నుంచి మొదలుకొని రాత్రి 9గంటల వరకు దాదాపు 10గంటల పా టు నిరంతరాయంగా ఆమె కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి నిజామాబా ద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయబావుటా ఎగరవేసేలా కృషి చేశారు. ఆ తర్వాత ఆమె జిల్లాకు రాలేరు. ఇటీవల పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నవీపేట్ మం డలం పొతంగల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత నగరంలోని తిలక్ గార్డెన్‌లో ట్విట్టర్ సంస్థ ఏర్పాటు చేసిన ఆస్క్ ఎంపీ కవిత కార్యక్రమం ద్వారా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమం తర్వాత గురువారం ఆమె జిల్లా కేంద్రానికి వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ షెడ్యూల్ నడుమ వివిధ కార్యక్రమాల్లో పా ల్గొన్నారు. సమావేశాల్లో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలతో మమేకమయ్యారు. ఇటీవల ఉత్త మ పార్లమెంటేరియన్‌గా ఆమె ఎంపికై అవార్డు అందుకోవడంతో జిల్లా ప్రజలతో పాటు వివిధ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆత్మీయ సత్కారాలతో ఆ మెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ టెలికాం అడ్వయిజరీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీఎస్‌ఎన్‌ఎల్ స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్వ వైభవం దిశగా బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను విస్తరించే క్రమంలో కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది యావత్తు ఆమెకు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన నేపథ్యంలో కుర్చీలపై నుంచి లేచి నిలబడి కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు చెప్పి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. టీఎన్జీవో నాయకులు, ఉద్యోగులు గజమాలతో ఎంపీని సత్కరించారు. అహర్నిశలు తమకు అ న్ని విధాలుగా అండదండలు అందిస్తున్న కవితకు జ్ఞాపికను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ మైదానంలో జరిగిన సమీకృత మత్స్యశాఖ అభివృ ద్ధి అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. గంగపుత్రులతో పాటు అన్ని కులవృత్తుల బలోపేతానికి ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కులవృత్తులకు జవజీవాలందించడం ద్వారా పల్లెల్లో సంపద సృష్టిస్తున్నామని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా చర్రిత తిరగరాస్తూ మత్స్యకారులకు రూ. 23 కోట్లతో వాహనాలు, ఇతర సామగ్రిని పంపిణీ చేసి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు. ఎకరం స్థలంలో రూ. 50లక్షలతో ప్రత్యేకంగా నగరంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన బీసీల రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలు కులాల ఫెడరేషన్ సభ్యులకు వంద శాతం సబ్సిడీపై ఇచ్చిన రుణాలను అందజేశారు.

ఆర్థికంగా బీసీ కులాలన్నీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇప్పుడిస్తున్న రూ. 50వేల రుణంతో పాటు బ్యాం కులతో సంబంధం లేకుండా రూ. లక్ష, రూ. 2లక్షలు ఆ పై రుణాలను పూర్తి సబ్సిడీతో ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం బీసీ కులాల్లో కొత్త ఉత్సాహాన్ని నిం పింది. ఆ తర్వాత పలువురి పెళ్లిళ్లకు హాజరై వధూవరులను ఎంపీ కవిత ఆశీర్వదించారు. తమ అభిమాన నా యకురాలు పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించడం తో కొత్త దంపతులు, వారి బంధువులకు మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ చాంబరులో మున్సిపల్ అధికారులతో గంటకు పైగా ఆమె ముసాయిదా మాస్టర్‌ప్లాన్ పై ఇటీవల వచ్చిన అభ్యంతరాలు, సలహాల గురించి చర్చించారు. రోడ్డు వె డల్పు, జోన్ల విషయంలో నగర ప్రజల నుంచి వస్తున్ను అభ్యంతరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. మాస్టర్‌ప్లాన్‌కు ఆటంకం లేకుండా, నగరాభివృద్ధికి ఇబ్బంది కలగకుండా ప్రజల అభ్యంతరాలు, సలహాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకొని మార్పులు, చేర్పులు చేయవచ్చో అధికారులతో చర్చించారు. అక్కడే వివిధ శాఖలపై సమీక్షించారు.త్వరలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు రాబట్టాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో స్ట్రీట్ పుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఎంపీకవిత, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలనుద్దేశించి ప్రసంగించారు. ఆర్థికంగా మహిళలు నిలదొక్కుకునేలా ప్రభుత్వం పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పబోతున్నదని తెలిపారు. అన్నిరంగాల్లో మహిళలు ముందుండాలని ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆమె భేటీ అయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి పకడ్బందీగా గ్రామ పాలన చేయాలని సూచించారు. ఎక్కువగా యువత సర్పంచులుగా ఎన్నికయ్యారని, ఉత్సాహంతో పనిచేసి గ్రామ ప్రజల మెప్పు పొందాలని పిలుపునిచ్చారు. ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన నేపథ్యంలో అడుగడుగునా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, జాగృతి నాయకులు, ప్రజలు పుష్ఫగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 11గంటల పాటు నగరంలో వివిధ కార్యక్రమాల్లో ఎంపీ కవిత పాల్గొనడంతో అంతా సందడి సందడిగా కనిపించింది.

261
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...