అడవుల రక్షణకు ప్రమాణం


Fri,February 15, 2019 12:43 AM

నిజామాబాద్ క్రైం : అటవీ సంపదను కొల్లగొట్టడంతో పాటు వన్యప్రాణులను అంతం చేస్తున్న వారిని వదిలిపె ట్ట వద్దని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ అటవీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగం గా అడవులు ఉన్న ప్రాంతాల ప్రజల మద్దతుతో అటవీ సంపదను కాపాడేందుకు మరో కొత్త తరహా కార్యక్రమానికి అటవీ అధికారులు శ్రీకారం చుట్టారు. అటవీ, పో లీస్ శాఖల అధికారులు సంయుక్తంగా అటవీ రక్షణకు ప్రజల చేత ప్రమాణం చేయించే వినూత్న కార్యాచరణ ప్రారంభించారు. బతుకునిచ్చే అడవిని నరకబోం.. నీడనిచ్చే చెట్లకు నిప్పు పెట్టం. వన్యప్రాణులను వధించ బోం అంటూ రాష్ట్రంలో అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలతో ప్రతిజ్ఞ్ఞ(ప్రమాణం)చేయిస్తున్నారు. జంగల్ బచావో...జంగల్ బడావో అనే నినాదానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అడవుల పరిరక్షణ కు అటవీ, పోలీస్ అధికారులు త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఒకవైపు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతూనే, స్థానికులు నేరస్తులకు సహకరించకుండా చైతన్యపరుస్తున్నారు. తరచూ అటవీ నేరాలకు పాల్పడుతు న్న వారిని పట్టుకుని సీఆర్‌పీసీ సెక్షన్ 110 ప్రకారం బైండోవర్ చేస్తున్నారు. అలాంటి వారు మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై కఠిన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపించేందుకు రంగం సిద్ధ్దం చేస్తున్నారు. అడవుల రక్షణ కోసం సర్పంచులు, స్థానిక గ్రామాల ప్రజల తో ప్రమాణం చేయిస్తున్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...