అంకాపూర్‌ను సందర్శించిన టీవోటీ అధికారులు


Thu,February 14, 2019 03:01 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : నూతన సర్పంచులుగా ఎన్నికైన వారికి శిక్షణనిచ్చే శిక్షకులు(టీవోటీ) ఆదర్శ గ్రామం అంకాపూర్‌ను సందర్శించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌కు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్లు ఫీల్డ్ విజిట్‌లో భాగంగా బుధవారం వచ్చారు. ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, మాజీ సర్పంచులతో, టీఎన్జీవోలతో కూడిన టీవోటీలు అంకాపూర్‌లో పంటల సాగు, గ్రామాభివృద్ధి గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు ఆ బృందం టీం లీడర్ భగవాన్‌రెడ్డి తెలిపారు. టీవోటీలకు సీఎం కేసీఆర్ ఒక రోజు, రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఐదు రోజులు శిక్షణనిచ్చారు. శిక్షణ తర్వాత మూడు రోజల ఫీల్డ్ విజిట్‌లో భాగంగా అంకాపూర్ వచ్చినట్లు చెప్పారు. మొదట డీపీవో కృష్ణమూర్తి, ఆర్మూర్ ఎంపీడీవో టీవీఎస్ గోపిబాబు ఆధ్వర్యంలోని అధికారుల బృంద సభ్యులతో టీవోటీలు సమావేశమై అంకాపూర్ గ్రామాభివృద్ధి, పంటల సాగు విధానాలను తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు పండిస్తున్న ఎర్రజొన్న, పసుపు, కూరగాయల పంటలను పరిశీలించారు. అంకాపూర్ రైతుల పంటల సాగు పద్ధతులు, రైతులు అవలంబిస్తున్న నూతన సాగు విధానాలు ప్రశంసనీయంగా ఉన్నట్లు టీవోటీల బృందం కొనియాడింది. కార్యక్రమంలో సర్పంచ్ మచ్చర్ల పూజిత, ఉపసర్పంచ్ కిశోర్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీలేఖ, సొసైటీ చైర్మన్ మార గంగారెడ్డి, వీడీసీ అధ్యక్షుడు గంగారెడ్డి, గురడిరెడ్డి రైతు సంఘం అధ్యక్షుడు లింగారెడ్డి, ఏవో హరికృష్ణ, హెచ్‌వో విద్యాసాగర్, ఈవోపీఆర్డీ దామోదర్, పంచాయతీ కార్యదర్శి జి. శ్రీనివాస్, రైతు కేకే. భాజన్న తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...