ఫిర్యాదు చేస్తవా.. అంతు చూస్తాం..


Thu,February 14, 2019 02:59 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : తమ గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.. డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఫోన్ కాల్ నంబరు ఇసుక అక్రమ ర వాణాదారులకు తెలిసిపోతోంది. ఫిర్యాదు చేస్తావా.. అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని కోనాపూర్ గ్రా మస్తులు వాపోతున్నారు. తమ గ్రామంలో కొంత కాలం గా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని పేర్కొంటూ కోనాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచు, గ్రామస్తులు మంగళవారం ఆర్మూర్ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తగు చర్యలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. గ్రామానికి చెందిన బోదాసు బాలయ్య, బోదాసు ఎల్ల య్య తమ గ్రామ సమీపంలోని పెద్ద వాగు నుంచి ఇసుక ను అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నా రు. ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

ఇ సుక అక్రమ రవాణా వ్యవహారాన్ని డయల్ 100కు ఫిర్యాదు చేస్తే కాల్ నంబర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తు న్న వారికి లీకయిపోతున్నాయని.. దీంతో ఇసుక దందాతో సంబంధమున్న వ్యక్తులు ఫిర్యాదు చేసిన వా రిని తీవ్ర ఆందోళన కలిగించేలా బెదిరిస్తున్నారని ఆర్డీవోకు వివరించారు. ఇదే విషయాన్ని స్థానిక విలేకరులతో తె లిపారు. గ్రామ శివారుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను ఫోన్‌లో చిత్రీకరించి తెచ్చి ఆర్డీవోకు, విలేకరులకు చూపించారు.
ఈ వ్యవహారాన్ని ఆర్డీవో సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే గ్రామస్తుల ముందే కమ్మర్‌పల్లి తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే తగు చర్యలు చేపట్టి ఇసుక రవాణాను అరికట్టాలని, ఇసుక డంపులను సీజ్ చేయాలని ఆదేశించారు. అంతకు ముందు గ్రామస్తులు తహసీల్దార్ ధన్వాల్‌కు, కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో వినతిప్రతం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ద య్య దేవయ్య, ఉప సర్పంచ్ టేకుల జలందర్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...