వరకట్న వేధింపుల కేసులో భర్తకు జైలు


Thu,February 14, 2019 02:59 AM

నిజామాబాద్ లీగల్ : వరకట్నపు వేధింపుల కేసులో పల్లెపు రాజేందర్‌కు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్షణ విధిస్తూ నిజామాబాద్ ప్రత్యేక ప్రథమశ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పెద్ది చందన బుధవారం తీర్పు చెప్పారు. వివరాలు ఈ విధంగా ఉన్నా యి. ధర్పల్లి గ్రామానికి చెందిన పల్లెపు లక్ష్మి వివాహం 2006లో జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన రాజేందర్‌తో జరిగింది. కొన్ని నెలలు బాగానే ఉన్న దంపతులు ఆ తర్వాత భర్త అదనపు కట్నం కావాలని లక్ష్మిని శారీరకంగా, మానసిక చిత్ర హింసలకు గురిచేయ సాగాడు. మామ రాజన్న, మేనత్త నర్సవ్వ, రాజేందర్‌లు లక్ష్మిని వేధించారని ధర్పల్లి పోలీసు స్టేషన్‌లో లక్ష్మి 11, ఫిబ్రవరి 2011లో ఫిర్యాదు చేసింది. పూర్తి విచారణ అనంత రం పోలీసులు చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. సాక్షుల సాక్ష్యా లను, ఇతర ఆధారాలు పరిశీలించిన జడ్జి చందన ముద్దాయి రా జేందర్‌పై వరకట్న వేధింపుల నేరం రుజువైందని ప్రకటిస్తూ ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష, భార్యను బెదిరించినందున మరో సెక్షన్ ప్రకారం మూడు నెలల శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...