హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు


Thu,February 14, 2019 02:59 AM

నిజామాబాద్ లీగల్ : ఒక వ్యక్తిని హత్య చేసిన గౌడ దేవేందర్, ఒర్సు సాయిలుకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నాగార్జున బుధవారం తీర్పు వెలువరించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శశికిరణ్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్‌లో సంతోష్‌నగర్‌లో నివసించే గౌడ దేవేందర్, ఒర్సు సాయిలు, షేక్ మహ్మద్ స్నేహితు లు కూలి పనిచేస్తూ జీవించేవారు. ఒక రోజు గడ్డం సాయిలు ద గ్గరికి కూలి పనికి వెళ్లారు. తన దగ్గర ఉన్న నోట్ల కట్టలో నుంచి కూలి డబ్బులు తీసి ఇచ్చాడు. గడ్డం సాయిలు దగ్గర ఉన్న మిగతా డబ్బులు కాజేయాలనుకున్నారు. ఆ తర్వాత అతనికి ఫోన్ చేసి అందరం కలిసి మద్యం తాగుదామని రమ్మని పిలిచారు. అందరూ ఆర్మూర్ శివారు ప్రాంతానికి వెళ్లి మద్యం తాగారు. ఒక ప్లాన్ ప్రకా రం ముందు తెచ్చుకున్న కత్తితో ఒర్సు సాయిలు గడ్డం సాయిలును చాతిలో పొడిచారు. అతను అరవడంతో దేవేందర్ తన దగ్గర గల కత్తితో చాతి పైన, కడుపులో, గొంతు కోసి దారుణంగా హత్య చేసి రూ.4వేలు తీసుకుని సమానంగా పంచుకున్నారు. ఆర్మూర్ పోలీ సులు కేసు నమోదు చేసుకొని విచారణ అనంతరం అభియోగప త్రాన్ని కోర్టులో సమర్పించారు. నేర విచారణలో భాగంగా సాక్షుల సాక్ష్యాలను నమోదు చేసిన అదనపు సెషన్స్ కోర్టు సాక్ష్యాధారాల ను బట్టి మొదటి ముద్దాయి దేవేందర్, రెండో ముద్దాయి ఒర్సు సాయిలుపై హత్యానేరం రుజువైందని ప్రకటిస్తూ జీవిత కారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ప్రకటించారు. మూడో ముద్దాయి మహ్మద్ పై నేరం రుజువుకానందున నిర్ధోషిగా విడుదల చేశారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...