ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా..?


Wed,February 13, 2019 02:19 AM

-ఇసుక రవాణాకు అడ్డదారులు వెతుకుతున్న అక్రమార్కులు
-మామూళ్ల మత్తులో జోగుతున్న పలువురు
-చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
భీమ్‌గల్ : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు ఎత్తుగడలు వేస్తుంటే అక్రమ రవాణా దారులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. గతంలో భీమ్‌గల్ పట్టణంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం అధికారులకు తలనొప్పిగా ఉండేది. ప్రస్తుతం అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. కేవలం వారానికి ఒక్క రోజు మాత్రమే వాగులో నుంచి ఇసుకను ప్రభుత్వ అనుమతితో తీసుకునేలా నిర్ణయించారు. దీంతో ఇసుక అక్ర మ రవాణాకు అడ్డుకట్టపడింది. ఇదిలా ఉండగా కొందరు ఇసుకను అనుమతి లేకుండా అడ్డదారుల్లో తీసి వ్యాపారం చేసేందుకు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. ఇసుకను వాగు లో నుంచి ఉదయం, రాత్రి పూట ఆటోల్లో సంచుల్లో నింపి అక్రమ రవాణకు పాల్పడుతున్నారు. ఇదే కాకుండా ఎడ్ల బండ్ల ద్వారా కూడా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు.

ఎడ్లబండ్లకు భలే గిరాకీ..
ఇసుక అక్రమ రవాణాను ఎడ్ల బండ్ల ద్వారా చేయడంతో కొందరు లక్షల రూపాయలు పెట్టి మరి ఎడ్లతో పాటు బం డ్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు ఎడ్ల బండ్లను కొనుగోలు చేసి మరి ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అదే పని గా ఎడ్లబండ్ల్లపై ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో గిరాకీ లేకుండా పోయిన ఎడ్ల బండ్లకు తిరిగి డిమాండ్ ఏర్పడింది.
ఆటోకు రూ.3వేలు, ఎడ్ల బండికి రూ.రెండు వేలు..
ఇసుక అక్రమ రవాణాకు ఎడ్లబండిని ఉపయోగిస్తే రూ.2 వేలు, ఆటోను ఉపయోగిస్తే రూ.3వేలు అధికారులకు ముడుపులు ఇవ్వాల్సిందే. దీంతో పాటు ఆటోలను నడిపిన వారు ఇతర ఒత్తిడి చేసే నాయకులకు సైతం ప్రతినెల రూ. వేల చెల్లిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ముడుపులు చెలిస్తున్నామనే ధీమాతో ఇష్టారాజ్యంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. ఇసుక రవాణాను అరికట్టాల్సిన అధికారులు, పెద్దమనుషులు ముడుపుల మత్తులో అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...