మార్చి 10న పోలియో చుక్కలు వేయాలి


Mon,February 11, 2019 11:50 PM

నిజామాబాద్ స్పోర్ట్స్ : మార్చి 10న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేండ్లలోపు పిల్లందరికీ విధిగా చుక్కల మందు వేయాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్ సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో పల్స్ పోలియో, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుం చి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, బ్యాన ర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చి 10 నుంచి 12వ తేదీ వరకు పోలియో మందును చల్లని ప్రదేశంలో నిలువ ఉంచేందుకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రభుత్వ దవాఖానల పరిధిలో నిరంతరాయం గా విద్యుత్ సరఫరా కొనసాగేలా చూడాలన్నారు. మైనార్టీ నాయకుల సమావేశాల్లో కూడా చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేలా ప్రజలకు సందేశం పంపాలన్నారు.

19, 23న నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం...
ఈ నెల 19, 23 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నులి పురుగులు ఏర్పడిన పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, శారీరకంగా, మానసికంగా ఎదగకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఈ నులి పురుగుల నిర్మూలన మా త్రలను తప్పకుండా వేయించాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఈ మాత్రలు వేయించాలన్నారు. సుమారు ఐదు లక్షల మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, అంగన్‌వాడీ కార్యకర్తలు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...