పథకం ప్రకారమే వృద్ధురాలి హత్య


Mon,February 11, 2019 11:50 PM

బోధన్ రూరల్ : బోధన్ మండలంలోని ఏరాజ్‌పల్లి గ్రా మంలో పక్షం రోజుల క్రితం పథకం ప్రకారం జరిగిన ఓ వృద్ధురాలి హత్య కేసులో భాగంగా పోలీసులు, పూడ్చిపెట్టిన శవాన్ని బ యటకు తీయించిన అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. గత నెల 24న అర్ధరాత్రి గంగవ్వను హత్య చే సిన సంఘటన సోమవారం అధికారుల విచారణలో బ యటపడింది. గ్రామస్తుల అనుమానంలో భాగంగా అధికారులు సదరు వ్యక్తులపై నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడింది. సంఘటనకు సంబం ధించి రూరల్ సీఐ షాకీర్‌అలీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏరాజ్‌పల్లి గ్రామానికి చెందిన కటికె గంగ వ్వ(65) అనే వృద్ధురాలు అదే గ్రామానికి చెందిన యాకూ బ్ అనే వ్యక్తికి రూ.20వేలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బు లో రూ. 10 వేలు చెల్లించిన యాకూబ్‌ను సదరు వృద్ధురా లు మిగతా డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచింది. దీంతో యాకూబ్ అదే గ్రామానికి చెందిన ఆసరా సాయిలు అనే వ్యక్తి తో ఒప్పందం కుదుర్చుకుని రూ.2వేలు అతనికి ఇచ్చి, 24వ తేదీ తెల్లవారుజామున ఆమెను కొట్టి చం పారు. అనంతరం పక్కనే నీళ్లకుండీలో పడిపోయి మృతిచెందినట్లు చిత్రీకరించారు. కాగా, 24న ఉదయం ఆమె మేనల్లుడు పెంట య్య తన అత్త ప్రమాదవశాత్తు చనిపోయి ఉం టుందని భావిం చి అదే రోజున అంత్యక్రియలు జరిపించా రు. అయితే, గ్రామస్తుల రెండు రోజలు క్రితం యాకూబ్, సాయిలు అనే వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు. దీంతో అనుమానం నిజమని తేలింది. సదరు వ్య క్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం తామే చేసినట్లు ఒప్పుకున్నారు.
శవాన్ని బయటకు తీయించి విచారణ
ఏసీపీ రఘు, సీఐ షాకీర్ అలీ, ఫోరెన్సిక్ అధికారి రామ్మెహన్‌రావుల సమక్షంలో పాతిపెట్టిన శవాన్ని సోమవారం బయటకు తీయించారు. సదరు నిందితులు అసలు విష యం బయటపెట్టడంతో యాకూబ్, ఆసరా సాయిలుపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ షాకీర్ అలీ వెల్లడించారు. కేవలం రూ.10 వేలు ఎగ్గొట్టేందుకు పథకం ప్రకా రం యాకూబ్, సాయిలుతో కలిసి కటికె గంగవ్వను హ త్య చేసినట్లు ఆయన వెల్లడించారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...