భక్తుల కొంగు బంగారం అడ్కాస్ లింగమయ్య


Thu,September 13, 2018 12:34 AM

కోటగిరి: మండలంలోని లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నాగేంద్రపూర్ గ్రామ సమీపంలో గల గుట్టపై వెలిసిన అడ్కాస్ లింగమయ్య భక్తుల కొండు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఏటా వినాయక చవితి పండుగ మరుసటి రోజు ఆలయం వద్ద పెద్ద ఎత్తున జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆలయ విశిష్టత..
నాగేంద్రపూర్ గ్రామ సమీపంలో గుట్టపై రెండు బండరాళ్ల మధ్య వెలసిన లింగానికి కల్లూర్ గ్రామానికి చెందిన ఓ రైతు ఆవుల మందలోని ఒక ఆవు నిత్యం తన పాలతో అభిషేకించేదట. ప్రతి దినం ఆవుపాలతో అభిషేకించే విషయాన్ని పసిగట్టిన పశువుల కాపరి, తన యజమానికి ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో స్థానికులు అలయాన్ని నెలకొల్పారు. ఒకప్పుడు పిడికిలి పరిమాణంలో ఉన్న ఈ శివలింగం కాలక్రమేణా పెరిగి పెద్దదవుతోందని భక్తుల విశ్వాసం. గుడి ఎదుట ఉన్న ఒక రాయి కాలక్రమేణా పెరుగుతూ నంది ఆకృతిని సంతరించుకుందని భక్తుల నానుడి. ఇక్కడ శ్రావణమాసం నెల పాటు భక్తులు అలయం వద్ద ఉంటూ పూజలు చేస్తారు.

నెల రోజుల పాటు స్థానికంగా ఉంటారు. లింగమయ్యను పూజిస్తే కోర్కెలు తీరుతాయని, పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. శ్రావణమాసంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు.

ఐదు లింగాల్లో పెద్దది..
ఈ ఐదు లింగాల్లో పెద్దది అడ్కాస్ లింగమయ్య. పంచ లింగాలు ఇవే. అడ్కస్ లింగమయ్య కోటగిరి మండలం నాగేంద్రపూర్ గ్రామ సమీపంలో గుట్టపై వెలసింది. 2 బీర్కూర్ మండలం దుర్కిలోని సోమేశ్వర ఆలయం. 3 చిన్నకొడప్‌గల్‌లోని రామేశ్వరలింగం, 4 కౌలాస్‌లోని పరమేశ్వర లింగం, 5 దెగ్లూర్‌లోని హటుల్ పరమేశ్వరలింగం కలవు.

కోటగిరి: నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులు సాగుచేసిన వరి పంటలకు నిజాంసాగర్ కాలువ ద్వారా సాగునీటిని అందించి పంటలను కాపాడుతామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారని రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ కొల్లూర్ కిశోర్‌బాబు తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులు సాగుచేసిన వరి పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉందని, నీటి తడి ఆవశ్యకత ఉందని రైతుల తరపున మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంత్రి పోచారం వెంటనే స్పందించి టీఆర్‌ఎస్ రైతుల ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే ధ్యేయమని అన్నారని పేర్కొన్నారు. నిజాంసాగర్ నీటి విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. రైతుల పంటలకు నీరు ఎప్పడు అవసరం ఉంటే , ఆరోజే నీటిని విడుదల చేసి పంటలను కాపాడతామని అన్నారు. సమావేశంలో ఎంపీపీ మోరె సులోచన, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, శంకర్‌పటేల్, శ్రీనివాస్‌రావు, కూచిసిద్దూ తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందవద్దు
వర్ని: నిజాంసాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెంద వద్దని, నిజాం సాగర్‌లో 2.5టీఎంసీల నీరు నిల్వ ఉందని వర్ని మండల రైతు సమితి అధ్యక్షుడు పిట్ల శ్రీరాములు, రుద్రూర్ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలకు నీటి విడుదల కోసం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం సీఎం కేసీఆర్‌ని కోరగా, సీఎం సానుకూలంగా స్పందంచినట్లు తెలిపారు. అవసరమైతే సింగూరు నుంచి మరో మూడు టీఎంసీల నీటిని పంట పొలాల కోసం, తాగునీటికోసం విడుదల చేయమని సీఎం అధికారులను ఆదేశించినట్లు మంత్రి పోచారం తెలిపారన్నారు. రైతులు సాగు నీటి విషయంలో దిగులు చెం దవద్దని, చివరి ఆయకట్టు వరకు నీటి విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు.

204
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...