గులాబీ జెండా ఎగురడం ఖాయం


Thu,September 13, 2018 12:33 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి బుధవారం పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికలు నవంబర్, డిసెంబర్ నెలలో జరిగే అవకాశం ఉందని, రెండు మూడు వారాలు ఆలస్యంగా వచ్చినా టీఆర్‌ఎస్ గెలిచి తీరుతుందన్నారు. ప్రజాకోర్టుకు మించింది లేదని, ప్రజల దయతోనే అసెంబ్లీలో కూర్చుంటామని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటూ సవాల్ విసురుతున్న ప్రతిపక్షాలు, ఎన్నికల కమిషన్ ముందు మాత్రం ఇప్పుడే ఎన్నికలు ఎందుకూ అని అస్త్ర సన్యాసాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఢిల్లీ దిక్కు చూద్దామా? తెలంగాణ గల్లీ దిక్కు చూద్దామా? అని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ప్రజలకు ఇద్దరినీ ఒకేసారి వాయించి కొట్టే అవకాశం దొరికిందని పేర్కొన్నారు. అరవై ఏళ్ల రాబందుల పాలన కావాలో, రైతుబంధు పథకం పెట్టిన టీఆర్‌ఎస్ పాలన కావాలో తేల్చుకునే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలయిక నీచమైన చర్య అన్నారు.

తెలంగాణ వ్యతిరేకులంతా మహాకూటమి పేరుతో ఒకటయ్యారని ఆయన దుయ్యబట్టారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు కాదు.. వీరంతా మరోసారి కాబోయే ఎమ్మెల్యేలని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ కవిత కూడా జిల్లాలో టీఆర్‌ఎస్ మరోసారి అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల ఫలితాలు ఉమ్మడి జిల్లాలో పునరావృతం కానున్నాయని తెలిపారు. కాగా, సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీకి అదనపు బలం చేకూరిందని టీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఆర్మూర్,బాల్కొండ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ శిబిరంలో నయాజోష్ కనిపించింది. రెట్టించిన ఉత్సాహంతో కార్యరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యారు.కాగా, సురేశ్‌రెడ్డి ఇదే వేదికగా తన అనుచరులకు,కార్యకర్తలకు పిలుపునిస్తూ.. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి దాదాపు 5వేల మంది సురేశ్‌రెడ్డి అనుచరులు, అభిమానులు,కార్యకర్తలు తరలివెళ్లారు. వీరం తా సురేశ్‌రెడ్డితో పాటే టీఆర్‌ఎస్‌లో చేరారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...