హస్తం ఆగమాగం


Wed,September 12, 2018 01:59 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : కాంగ్రెస్ శ్రేణు ల్లో నైరాశ్యం అలుముకుంటున్నది. ఓవైపు టీఆర్‌ఎస్ ప్రజాక్షేత్రంలో దూసుకెళుతుండగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవరో తేలక సతమతమవుతోంది. దీంతో ఆయా నియోజకవర్గా ల్లో ఆశావాహుల్లో అసంతృప్తి నెలకొంటున్నది. కాంగ్రెస్, టీ డీపీ పొత్తు పంచాయితీ ఇంకా తేలలేదు. అప్పటి వరకు అ భ్యర్థుల ఖరారు తేలక కార్యకర్తలు, నాయకులు ఆగమాగమవుతున్నారు. మంగళవారం నుంచి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన జెండా పండుగ వెలవెలబోయింది. కార్యకర్తలు ఎవరూ పెద్దగా రాలేదు. నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించింది. దీన్ని తూతూమంత్రంగా కానిచ్చేసి చేతులు దులుపుకున్న నేతలు.. టికెట్ల వేటలో భాగంగా హైదరాబాద్‌కు పయనమయ్యారు.

టీడీపీలో పూర్తిగా శ్మశాన వైరాగ్యం అలుముకున్నది. పొత్తులో భాగంగా తమకు బాల్కొండ లేదా నిజామాబాద్ రూరల్ నుంచి ఒక్కసీటు వస్తే అదే గొప్ప అంటూ కాలయాపన చే స్తున్నది. ఇక కాంగ్రెస్‌లో నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిత్వం కోసం ఆశావాహుల పోటీ ప్రయత్నాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌తో పాటు నియోజవకర్గ ఇ న్‌చార్జిగా ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్, నరాల రత్నాకర్, కేశవేణు టికెట్ ఆశిస్తున్నారు. ఆకుల లలిత అర్బన్ టికెట్ రే సులో ఉన్నా, ఆర్మూర్ నుంచి సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆమెకు అటు రూటు క్లియర్ అయ్యింది. కాగా, అర్బన్‌లో తనకే టికెట్ ఇస్తారనే ధీమాతో మహేశ్‌కుమార్ గౌడ్ ఉన్నారు. కాగా, ఆయన ఫోన్‌లో మంగళవారం అందుబాటులో లేరు. టికెట్లను ఇంకా ప్రకటించకపోవడం కొంత ఇ బ్బందిగా ఉంది. ఓవైపు టీఆర్‌ఎస్ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నది.

వారు ఓ ప్లానింగ్ ప్రకారం ముందే టికెట్లు ప్రకటించేసుకొని ప్రచారాని రెడీ అయ్యారు. కాంగ్రెస్‌లో ఇంకా టికెట్ల విషయంలో, పొత్తుల విషయంలో స్పష్టత రా కపోవడం కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని నింపుతున్నదని కాం గ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే ని జామాబాద్ అర్బన్‌తో పాటు నిజామాబాద్ రూరల్‌లో కూ డా కాంగ్రెస్‌లో పోటీ నెలకొన్నది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అరికెల నర్సారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేశ్‌రెడ్డితో పాటు శేఖర్‌గౌడ్, ముప్పా గంగారెడ్డి, భూమ్‌రెడ్డి పోటీలు పడుతున్నారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న భూపతిరెడ్డి కూడా వీరికి తోడయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులను ప్రకటించే విషయంలో జా ప్యం చేస్తూ పోతే ఆయా నియోజకవర్గాల్లో పోటీ వాతావర ణం మరింత పెరుగుతుంది. నాకూ అవకాశం ఇవ్వండం టూ కొత్తగా మరొకరు పుట్టుకొస్తారు. దీంతో అసమ్మతి పెరి గే అవకాశం ఉందని మరో కాంగ్రెస్ నేత తన మనసులో మాటను బయటపెట్టారు.

దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్.. చేరికలతో కొత్త జోష్..
ప్రతిపక్షాలు పరేషాన్‌లో ఉండగానే.. మరో వైపు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎన్నికల కదనరంగంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో ఘనస్వాగతాలు లభించాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి బిగాల గణేశ్‌గుప్తా, ఆర్మూర్ అభ్యర్థిగా ఆశన్నగారి జీ వన్‌రెడ్డి, బాల్కొండ అభ్యర్థిగా వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ అభ్యర్థిగా షకీల్ ఆమేర్‌కు మళ్లీ రెండోసారి టికెట్ రావడంపై పార్టీ కార్యకర్తలు,నాయకులు ఉత్సాహంగా వారికి అపూర్వ స్వా గతం పలికారు. నియోజకవర్గాల వారీగా వీరంతా ప్రజలతో మేమకమవుతున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. దూకుడుగా వె ళ్తున్నారు. వినాయకచవితి అనంతరం ఇక ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి భారీగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఈకొత్త చేరికలతో టీఆర్‌ఎస్‌లో నయాజోష్ వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికల బరిలో తన సత్తా ఏంటో చాటేందుకు టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉండగా.. ప్రతిపక్షాలు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నాయి.

స్తబ్దుగా బీజేపీ..
బీజేపీలో ఎలాంటి అలికిడి లేదు. నిజామాబాద్ అర్బన్ మినహా జిల్లాలోని ఏ నియోజవకర్గంలో ఎవరు అభ్యర్థో తేలని పరిస్థితి ఉంది. అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, యెండల లక్ష్మీనారాయణ టికెట్ ఆశిస్తున్నారు. తనకే కచ్చితంగా టికెట్ దక్కుతుందని ధన్‌పాల్ భావిస్తున్నారు. బస్వా లక్ష్మీనారాయణ అర్బన్ టికెట్ ఆశిస్తున్నా, అవకాశం ఉండదని ఆ పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. గోతికాడి నక్కలా ఇతర పార్టీల నేతలెవరైనా వస్తారేమోననే ఆశతో ఎదురుచూస్తున్న పరిస్థితి బీజేపీలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా అసంతృప్తులు తమ పార్టీలోకి రాకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

206
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...