రైతులు సాగు పద్ధతులు మార్చుకోవాలి


Wed,September 12, 2018 01:58 AM

వర్ని : రైతులు వరి సాగులో పద్ధతులు మార్చుకోవాలని రాజేంద్రనగర్, హైదరాబాద్ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి.ప్రదీప్ రైతులకు సూచించారు. వర్ని, రుద్రూర్, కోటగరి మండలాల్లోని వరి పైరు ఎక్కువగా బ్యాక్టీరియా, ఎండుతెగులు బారిన పడుతుండడంతో గమనించిన శాస్త్రవేత్తలు వర్ని మండలంలోని హుమ్నాపూర్ గ్రామంలో వరి పంటను మంగళవారం పరిశీలించారు. అనంతరం రుద్రూర్ మండల కేంద్రంలో మూడు మండలాల రైతులతో శాస్త్రవేత్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరి సాగుపై రైతులను సమస్యలు, వారి అభిప్రాయాలను శాస్త్రవేత్తలు సేకరించారు. దిగుబడిని పెంచే విత్తనాల కోసం పరిశోధనలు చేసి తెలియజేయాలని పలువురు రైతులు శాస్త్రవేత్తలను కో రారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఎన్.ఆర్.జి.వర్మ, ఎల్.కృష్ణ, పి. కృష్ణబాబు, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డాక్టర్ ఎస్.నవీన్ కుమార్, డాక్టర్ రాథోడ్, ఎం.గో వింద్, కే.నగేశ్, సౌమ్య పాల్గొన్నారు.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...