మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం


Wed,September 12, 2018 01:57 AM

ఎడపల్లి : జిల్లాలోని మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. మండల కేంద్రంలో మత్స్యసహకార సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో ఉచితంగా చేపపిల్లలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మం డలానికి ఈ సారి పది లక్షల చేపపిల్లలను అందించనున్నట్లు ఆ యన తెలిపారు. ప్రస్తుతం 5 లక్షల చేపపిల్లల్ని మత్స్యకారులకు పం పిణీ చేస్తున్నామని అన్నారు. మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, ఐ స్‌బాక్సులు, వాహనాలను ప్రభుత్వం అందించనుందని అన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు డి.శ్రీరాం, ఎడపల్లి ఎంపీటీసీ ఆకులశ్రీనివాస్, మత్స్యసహకార సంఘం నియోజకవర్గం అధ్యక్షుడు బోయిడి లక్ష్మణ్, నాయకులు ఎల్లయ్యయాద వ్, రవీందర్‌గౌడ్, మత్స్యకారులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...