విద్యార్థులు సమయాన్ని వృథా చేయొద్దు


Wed,September 12, 2018 01:57 AM

కోటగిరి: విద్యార్థులు ఇప్పటి నుంచే బాగా ఇష్టపడి చదవాలని, చదువుకునే వయస్సులో వృథా చేయవద్దని డీఐఈవో దాసరి ఒడ్డెన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఐఈవో దాసరి ఒడ్డెన్న హాజరయ్యారు. చదువుల తల్లి సరస్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి, మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని వారి ఆశయాలకు అనుగుణంగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. 95 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ రఘురాజ్ తనవంతు ప్రోత్సాహకంగా రూ.5000 నగదును అందజేస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రఘురాజ్, గురువారెడ్డి, చిరంజీవులు, రవికుమార్, లక్ష్మీనారాయణ, అధ్యాపకులు ప్రమోద్, దత్తత్రి తదితరులు పాల్గొన్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...