నేడే షురూ..


Mon,September 10, 2018 02:55 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై జిల్లా యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు సవరణ తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1న ఉన్న ఓటరు జాబితా ప్రతిపాదికన ఉన్న ఓటర్లపై అభ్యంతరాల స్వీకరణతో పాటు, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల మార్పిడి తదితర సవరణలకు చర్యలు తీసుకోనున్నారు. దీనికోసం కాల పరిమితిని నిర్ణయించారు. ఈ నెల 10న (సోమవారం) అన్ని నియోజకవర్గాల వారీగా 2018 జనవరి 1 నాటికి ఉన్న ఓటరు జాబితాను ప్రదర్శిస్తారు. ఇదే రోజు నుంచి ఈనెల 25వరకు కొత్తగా ఓటర్ల నమోదు అభ్యంతరాలు, సవరణలకు అవకాశమిస్తారు. ఈనెల 15, 16తేదీల్లో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈ విషయంలో గ్రామసభ తదితర సమావేశాల ద్వారా విస్తృత అవగాహన కోసం ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

వచ్చే నెల 4న అప్పటి వరకు స్వీకరించిన అభ్యంతరాలను నియోజకవర్గాల వారీగా ప్రదర్శిస్తారు. అనంతరం వచ్చే నెల 7న మార్పులు, చేర్పులకు సంబంధించిన వివరాలన్నీ పొందుపర్చి ఓటరు జాబితాను రూపొందిస్తారు. ఈ రూపొందిన కొత్త జాబితాను వచ్చే నెల 8న విడుదల చేస్తారు. నెల రోజుల సమయంలోపు ఈ కార్యక్రమంతా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కాగా, జిల్లాలో మొత్తం 10.98 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 5.26 లక్షల మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 5.71 లక్షల మంది ఉన్నారు.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...