కమ్మర్‌పల్లిలో క్షీరాభిషేకాలు..


Mon,September 10, 2018 02:54 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండలంలోని నాగాపూర్, దమ్మన్న పేట్, ఉప్లూర్, మండల కేంద్రమైన కమ్మర్‌పల్లి టీఆర్‌ఎస్ నాయకులు, స్థానికులు, వీడీసీ సభ్యులు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండల కేంద్రంలో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయించినందుకు టీఆర్‌ఎస్ నాయకులు, వీడీసీ సభ్యులు పాలాభిషేకం చేశారు. కల్యాణ మండపం మంజూరుతో శుభకార్యాలు, సమావేశాలు తదితర కార్యక్రమాల నిర్వహణలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం లభించినట్లయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. నాగాపూర్ నుంచి దమ్మన్నపేట్ వరకు బీటీ రూ.35 లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేయించడంతో నాగాపూర్, దమ్మన్నపేట్, ఉప్లూర్ గ్రామస్తులు, టీఆర్‌ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. బీటీ రోడ్డుతో మూడు గ్రామాల ప్రజలకు చక్కని రోడ్డు సౌకర్యం కలుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కల్యాణ మండపం, బీటీ రోడ్డు మంజూరు చేయించిన వేముల ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లుక్క గంగాధర్, రైతు సమన్వయ సమితి మండల కో-ర్డినేటర్ రేగుంట దేవేందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం చిన్నారెడ్డి, విండో చైర్మన్ బద్దం భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ కొత్తపల్లి హారిక, మాజీ సర్పంచ్ శంకర నాయక్, మాసం రాజేశ్వర్‌గౌడ్, హల్దె శ్రీనివాస్, వేముల శ్రీనివాస్, పన్నాల గంగారెడ్డి, బద్దం రాజశేఖర్, ఆవారి రమేశ్, కొత్తపల్లి రఘు, మైలారం సుధాకర్, సుంకరి మురళి, వీడీసీ అధ్యక్షుడు సుంకెట రాజారెడ్డి, దుంపల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...