గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వ సహకారం


Mon,September 10, 2018 02:53 AM

భీమ్‌గల్: గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు బదావత్ శర్మానాయక్ అన్నారు. ఆదివారం భీమ్‌గల్ మండలంలోని కారేపల్లిలో లంబాడాలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవితక్క, బాల్కొండ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శర్మానాయక్ మాట్లాడారు. మెండోరా వాచ్యాతండాకు రూ.95 లక్షలు, కారేపల్లి తండాకు రూ.65 లక్షలు, గోన్‌గొప్పుల రాంజీ తండాకు రూ.49 లక్షలు, తాళ్లపల్లి తండాకు రూ.15 లక్షలను మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ పాలాభిషేకం చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన జీవో ప్రతులను ఆయా తండాల పెద్దలకు శర్మానాయక్ అందజేశారు. మరోమారు గిరిజనులు వేముల ప్రశాంత్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఆయా గ్రామాల గిరిజనులు బిక్యానాయక్, దేవూజీ నాయక్, హరిచంద్ నాయక్, వాసు నాయక్, శ్రీను నాయక్, వెంకటేశ్ నాయక్, రాంజీ నాయక్, రూప్‌సింగ్ నాయక్, రెడ్డి నాయక్, జగ్మల్ నాయక్, భీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...