అంతర్జాతీయ వేదికలపై కోట సిరి ప్రదర్శనలు అద్భుతం


Sat,September 8, 2018 01:25 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: చిన్నతనంలోనే విజయ్‌హైస్కూల్ విద్యార్థిని కోట సిరి అంతర్జాతీయ వేదికలపై చేసిన నృత్యప్రదర్శనలను అనిర్వచనీయమని ప్రిన్సిపాల్ కవితాదివాకర్ అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని విజయ్‌హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న కోట సిరిని శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... కోట సిరి చదువులోనే కాకుండా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహాంతో నృత్యంలో అబ్బురపరిచే ప్రదర్శనలు ఇస్తూ ప్రత్యేకతను చాటిందన్నారు. హైదరాబాద్, వియాత్నం, దుబాయి లాంటి అంతర్జాతీయ వేదికలపై పేరణిలాస్యంతో పాటు, పలు దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శలు చేసి అందిరి మెప్పు పొందిందన్నారు. మెట్‌పల్లిలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఏకధాటిగా 6 గంటల పాటు 90 శాస్త్రీయ, జానపద పాటలపై రకరకాల బంగిమలతో 9 రకాల నృత్యాలు ప్రదర్శించి 9 ప్రపంచ రికార్డులను కోట సిరి కైవసం చేసుకుందన్నారు. అనంతరం కోటసిరిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హజరైన నేషనల్ క్లాసికల్ డాన్స్ ఆకాడమీ నిర్వాహకురాలు స్వాతిభరద్వాజ్ కోట సిరి నృత్య ప్రదర్శనకు ముగ్దురాలై నేషనల్ క్లాసికల్ డాన్స్ అకాడమీ జిల్లా అధ్యక్షురాలిగా ప్రకటించారు. కోట సిరి ప్రతి ఏడాది శాస్త్రీయ నృత్య పదర్శనలు ఇచ్చినట్లు నేషనల్ క్లాసికల్ డాన్స్ అకాడమీకి తెలియపరిస్తే ప్రతి ఏటా తగిన పారితోషికం(స్కాలర్‌షిప్)ఇచ్చి సన్మానిస్తామన్నారు. అంతకుముందు విద్యార్థిని చేసిన నృత్యప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాద్యాయ బృందం, విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాల్గొన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...