సిట్టింగులకే ఛాన్స్


Fri,September 7, 2018 02:01 AM

- జిల్లాలో ఐదు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వాలు ఖరారు
- గెలుపు గుర్రాలకు జైకొట్టిన కేసీఆర్
- ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గెలుస్తా : వేముల ప్రశాంత్‌రెడ్డి
- నా జీవితం సార్థకమైంది: బిగాల గణేశ్ గుప్తా
- అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్ : మహ్మద్ షకీల్
- రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం: బాజిరెడ్డి గోవర్ధన్
- మళ్లీ చరిత్ర సృష్టిస్తాం: ఆశన్నగారి జీవన్‌రెడ్డి
- బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి ఖరారు

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: రాజకీయ సంచలనానికి కేసీఆర్ తెరతీశారు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠను బ్రేక్ చేస్తూ గురువారం అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు ఏకంగా 105మంది అభ్యర్థులను ప్రకటించి సాహసోపేత నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించారు. జిల్లాలోని ఐదింటికి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగులకే పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాల్కొండ అభ్యర్థిగా వేముల ప్రశాంత్‌రెడ్డి, బోధన్ అభ్యర్థిగా మహ్మద్ షకీల్ ఆమేర్‌కు అభ్యర్థిత్వాలను టీఆర్‌ఎస్ దళపతి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయా నియోజకవర్గాలో నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే ప్రగతి నివేదన సభ సక్సెస్‌తో గులాబీ దళం జోష్ మీదున్నది. కేసీఆర్ ఎన్నికలకు సమరశంఖం పూరించిన రోజే అభ్యర్థులను ప్రకటించడంతో ఉత్సాహంగా ఎన్నికల బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్‌ఎస్ దూకుడుతో ఎన్నికల సమరంలో దూసుకెళ్లేందుకు సిద్ధం కాగా, ప్రతిపక్షాలు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

జిల్లాలో రాజకీయ సంచలనానికి కేసీఆర్ తెరతీశారు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠను బ్రేక్ చేస్తూ అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. జిల్లాలో ఐదింటికి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగులకే పార్టీ అభ్యర్థిలు ఖరారు చేశారు. ముందు నుంచి చెప్తూ వస్తున్నట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అభ్యర్థిత్వాలు వరించాయి. ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించిన కేసీఆర్, ఇక అభ్యర్థుల విషయంలో తాత్సారం చేయలేదు. వెంటనే అభ్యర్థులను ప్రకటించడంతో ఇక క్షేత్రస్థాయిలో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టడమే తరువాయిగా ఉంది. కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాలోనే జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలకు మరోసారి ఛాన్స్ లభించింది. గెలుపు గుర్రాల జాబితాలో మన ఇందూరు నేతలు ఉన్నారు. ఈ పరిణామం ప్రతిపక్ష పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాల్లో అందరు సిట్టింగులకే తొలి జాబితాలోనే సువర్ణావకాశం దక్కింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సహా అందరూ ఎమ్మెల్యేలకు మరోమారు పోటీ చేసే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగాల గణేశ్ గుప్తా, రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాల్కొండ అభ్యర్థిగా వేముల ప్రశాంత్‌రెడ్డి, బోధన్ అభ్యర్థిగా మహ్మద్ షకీల్ ఆమేర్‌కు టికెట్లు ఖరారయ్యాయి. దీంతో ఆయా నియోజకవర్గాలో నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే నివేదన సభ సక్సెస్‌తో గులాబీ దళం జోష్ మీదున్నది. కేసీఆర్ ఎన్నికలకు సమరశంఖం పూరించిన రోజే అభ్యర్థులను ప్రకటించడంతో ఉత్సాహంగా ఎన్నికల బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. నియోజకవర్గాల వారీగా పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకొని నోరు తీపి చేసుకున్నారు. ఇక ఎన్నికల బరిలోకి దిగి ప్రచార పర్వాన్ని మొదలు పెట్టేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఈ మేరకు అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మరోమారు ప్రజల ఆశీస్సులు చూరగొనేలా ప్రచారాన్ని నిర్వహించి భారీ మెజార్టీతో గెలుపొందాలని దిశానిర్దేశం చేశారు.

ప్రతిపక్షాల్లో గుబులు...
ఓ వైపు టీఆర్‌ఎస్ దూకుడుతో ఎన్నికల సమరంలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండగా, ప్రతిపక్షాలు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ ఏ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థి అనేది వారికే క్లారిటీ లేదు. కానీ, టీఆర్‌ఎస్ మాత్రం అభ్యర్థుల జాబితాను జెట్ స్పీడ్‌తో ప్రకటించేసింది. గెలుపు గుర్రాలు వీరేనని తేల్చి చెప్పేసింది. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఈ దెబ్బతో కకావికలమైంది. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన కేసీఆర్, కాంగ్రెస్ వైఖరిపై తూర్పారబట్టారు. రండి ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పింఛన్లకు రూ. 2వేలు ఇస్తామనే ఆలోచన టీఆర్‌ఎస్‌తోనే వచ్చిందని, వాళ్లకు అంత సోయి ఎక్కడిదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్న టీడీపీతో జతకట్టి పోటీ చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నైజాన్ని ప్రజలు గమనించారని, వీరికి క్షేత్రస్థాయిలో డిపాజిట్లు దక్కవన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని గులాం పార్టీగా అభివర్ణిస్తున్నారని, టీఆర్‌ఎస్ ఆత్మగౌరవం అందించే పాలన దిశగా స్వయం నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రజలంతా తమవైపే ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇంటింటికీ కాంగ్రెస్ పేరిట వెళ్లిన సందర్భంలో చేదు అనుభవం ఎదురైంది. మంత్రిగా ఉన్నప్పుడు నీవేమి చేశావంటూ దివ్యాంగుడు ఒకరు నిలదీశారు. ఒత్తిడిలో ఉన్న కాంగ్రెస్ నేతలు దాడులకు దిగేందుకు తెగబడ్డారు. ఇక నిజామాబాద్ అర్బన్‌లో నువ్వా నేనా అభ్యర్థివి అనే రేంజ్‌లో కొట్లాటలు షురువయ్యాయి. ఆర్మూర్‌లో, బాల్కొండలో ఎవరూ అభ్యర్థో ఆ పార్టీ నాయకులకే తెలియదు. నిజామాబాద్ రూరల్‌లో అరికెల నర్సారెడ్డికి అంత సీన్ లేదని జనాలెప్పుడో తేల్చేశారు. ఇక బీజేపీ గోతికాడి నక్కలాగా టీఆర్‌ఎస్ నుంచి టికెట్ లభించని ఆశావాహులు ఎవరైనా వస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నది. ఈ పార్టీకి ఏ నియోజకవర్గం నుంచి అభ్యర్థి దిక్కు లేకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వేసిన స్కెచ్‌కు ప్రతిపక్షాలు విలవిలలాడుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇప్పుడెందుకు ఎన్నికలు? ఆయన మేము సిద్ధమే అంటూ తలో మాట మాట్లాడుతున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులు మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తామని, ప్రజల ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బాల్కొండ నియోజకవర్గం
అభ్యర్థి పేరు : వేముల ప్రశాంత్‌రెడ్డి
తండ్రి : దివంగత వేముల సురేందర్‌రెడ్డి
తల్లి : వేముల మంజుల
భార్య : వేముల నీరజరెడ్డి
తమ్ముడు : వేముల శ్రీనివాస్‌రెడ్డి
చెల్లెలు : రాధిక
పిల్లలు : కొడుకు పుజిత్ రెడ్డి, కూతురు మానవీరెడ్డి
గ్రామం : వేల్పూర్
మండలం : వేల్పూర్
నియోజకవర్గము : బాల్కొండ
పుట్టిన తేదీ: 14-3-1968
విద్యార్హత : బీఈ సివిల్
నిర్వహించిన పదవులు : మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం
పేరు : బాజిరెడ్డి గోవర్ధన్
తండ్రి : దిగంబర్ పటేల్
తల్లి : శాంతాబాయి
భార్యలు : వినోద, శోభ,
పిల్లలు : జగన్, అజయ్, కుమార్తె ధరణి
చెల్లెలు : శారద
గ్రామం : సిరికొండ మండలంలోని చీమన్‌పల్లి
నియోజకవర్గం : నిజామాబాద్ రూరల్
పుట్టిన తేదీ : 12-02- 1954
విద్యార్హత : బీఏ
నిర్వహించిన పదవులు : - 1981లో చీమన్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై తొలి రాజకీయ ప్రస్థానానికి నాంది పలికారు. అనంతర కాలంలో భీమ్‌గల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. - 1987లో సిరికొండ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. - 1992లో సిరికొండ మండల సింగిల్ విండో చైర్మన్‌గా, - 1993లో ఏపీఎస్‌ఎఫ్‌సీ డైరెక్టరుగా ఎన్నికయ్యారు. - 1994లో ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడు వేల ఓట్ల మెజార్టీతో విజయం. - 1999లో సైతం మరోసారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపు. - అనంతరం బాన్సువాడ ఎమ్మెల్యేగా విజయం. 33ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం సొంతం. కేసీఆర్ ఆశీర్వాదంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా పేరుగడించారు.

బాన్సువాడ నియోజకవర్గం
పేరు : పరిగె శ్రీనివాస రెడ్డి
తండ్రి పేరు : పరిగె రాజారెడ్డి
తల్లి : పాపమ్మ
భార్య : పరిగె పుష్పమ్మ
చదువు : (బీఈ)
పుట్టిన తేది : 10.02.1949
సంతానం : పరిగె రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అరుణ
స్వగ్రామం : పోచారం (బాన్సువాడ మండలం)
- 1976లో పరిగె శ్రీనివాస రెడ్డిగా రాజకీయ ఆరంగేట్రం ప్రారంభించారు.
- 1977లో సొసైటీ డైరెక్టర్(ఎల్‌ఎంబీ)గా పోటీ చేసి చేశారు. 1978లో బాన్సువాడ సమితికి పోటీ చేసి ప్రత్యర్థి ఆర్.వెంకట్రామ్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.
- 1987లో బుడ్మి,(తాడ్కోల్) అధ్యక్షుడిగా ఎన్నికై, ఎన్‌డీసీసీబీ చైర్మన్ అయ్యారు.
- 1988లో టీడీపీ జిల్లా అధ్యక్షడిగా పని చేశారు.
- 1989లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థి
బాలాగౌడ్ చేతిలో ఓటమి,
- 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.
- 1993లో నిజామాబాద్ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు.
- 1994లో బాన్సువాడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
- 1995లో టీడీపీ జిల్లా కన్వీనర్‌గా విధులు చేపట్టారు.
- 1998లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.
- 1999 భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.
- 2000 సంవత్సరంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
- 2002లో మంత్రి పదవికి రాజీనామ చేశారు.
- 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్ తోచేతిలో ఓటమి,
- 2005, 2007 వరకు జిల్లా టీడీపీ కన్వీనర్‌గా నియామకం.
- 2009సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడే ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ తెలంగాణపై ద్వంద్వ వైఖరికి నిరసనగా ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేశారు.
- 2011 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియామకం,
- 2011 ఉప ఎన్నికల్లో ఎమ్యెల్యేగా గెలుపొందారు.
- 2014లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వ్యవసాయ, సహకార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బాన్సువాడ నుంచి బరిలో ఉన్నారు.

బోధన్ నియోజకవర్గం
పేరు : మహ్మద్ షకీల్ ఆమేర్
తండ్రి : మహ్మద్ ఆజామ్
తల్లి : షాగుప్త్ ఆదీప్
భార్య : అయేషా ఫాతిమా ఆమేర్
అన్న : సోహెల్ ఆమేర్
పిల్లలు : కొడుకు మహ్మద్ రహీల్ ఆమేర్, కూతురు హైమేన్ ఫాతిమా ఆమేర్
స్వస్థలం : బోధన్
నియోజకవర్గం : బోధన్
పుట్టిన తేదీ : 07-03-1976
విద్యార్హత : బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు (యూఎస్‌ఏ)
- రాజకీయ రంగ ప్రవేశం: 20ఏళ్ల వయస్సులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
- 1996లో బీజేపీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి ప్రచారం చేశారు.
- బీజేపీ యువజన విభాగం నాయకుడిగా కొనసాగారు. - కేసీఆర్ ఆశీర్వాదంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా గెలిచారు.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం
అభ్యర్థి పేరు : బిగాల గణేశ్ గుప్తా
తండ్రి పేరు: బిగాల కృష్ణమూర్తి
తల్లి: సువర్ణమాల
భార్య: లత
తమ్మడు: బిగాల మహేశ్ గుప్తా
చెల్లెల్లు: రాణి, వాణి
పుట్టిన తేదీ: 17-04-1970
స్వస్థలం : మాక్లూర్
విద్యార్హత: బీఈ, సివిల్, గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్, బీదర్
రాజకీయ రంగ ప్రవేశం: - 2009లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.
- 2014లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

ఆర్మూర్ నియోజకవర్గం
పేరు : ఆశన్నగారి జీవన్‌రెడ్డి
తండ్రి : వెంకటరాజన్న
తల్లి: రాజాబాయి
భార్య: రజితరెడ్డి
తమ్ముడు: రాజేశ్వర్‌రెడ్డి
చెల్లెలు: కరుణ
కుటుంబ నేపథ్యం:
గ్రామం : వేల్పూర్ మండలం (జాన్కంపేట్)
నియోజకవర్గం : ఆర్మూర్
విద్యార్హత : ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
నిర్వహించిన పదవులు : టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, ఆర్మూర్ ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతల నిర్వహణ.246
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...