ఇందల్వాయిలో అగ్నిమాపక కేంద్రం


Thu,September 6, 2018 12:52 AM

నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకి జనాభా పెరుగుతుండడంతో దానికి తగ్గట్టుగా అవసరమైన అన్ని విధాల చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని రూరల్ నియోజికవర్గం ఇందల్వాయి మండల పరిధిలో అగ్నిమాపక కేంద్రం అవసరాన్ని గుర్తించిన ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అందుకు అంగీకరించడంతో నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఇందల్వాయి మండలం, గన్నారం గ్రా మ పరిధిలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ నుంచి అనుమతులు లభించాయి. అయితే ప్రస్తుతం తాత్కాలిక షెడ్డులో ఏర్పాటు చేస్తున్న ఈ అగ్నిమాపక కేంద్రాన్ని గురువారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రా ష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గౌరవ అతిథులుగా హాజరు కానున్నారు. దీంతో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పరిధిలో నిజామాబాద్ జిల్లా కేంద్రం, బోధ న్, ఆర్మూర్‌తో పాటు భీంగల్‌లో నాలుగు అగ్నిమాపక కేం ద్రాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలో జిల్లా కేంద్రం, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ, మద్నూర్, గాంధారిలో ఐదు అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి.

వీటిని మినహాయించగా నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఇందల్వాయి పరిధిలోని గన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్రం నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సౌజన్యంతో 20 గుంటల స్థలాన్ని కూడా కేటాయిచారు. అయితే నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.87 లక్షలు కేటాయించింది. ప్రస్తుతం మొదటి దఫాగా రూ.22లక్షల 91 వేలు మంజూరు కూడా చేయడం జరిగిందని జిల్లా అగ్నిమాపక అధికారి మురళిమనోహర్‌రెడ్డి తెలిపారు. నూతన భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యేంత వరకు ప్రస్తుతం గన్నారం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో తాత్కాలికంగా షెడ్డును ఏర్పాటు చేసి అందులో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...