ఆదుకోవాలని జేసీకి వినతి


Thu,September 6, 2018 12:51 AM

నందిపేట్ రూరల్ : నందిపేట్ మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో తమ దుకాణాలు పూర్తిగా కాలి పోయాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని అగ్ని ప్రమాద బాధితులు బుధవారం జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మీకం గా తనిఖీ చేసేందుకు జేసీ వచ్చారని తెలుసుకున్న దుకాణదారులు తహసీల్ కార్యాలయానికి పరుగులు తీశారు. తహసీల్ కార్యాల యం తనిఖీ అనంతరం వెనుదిరిగిన జేసీ వెంకటేశ్వర్లును ఆయన కారు వద్ద కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రమాద వశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో తమ దుకాణాలు పూర్తి కాలిపోయి సుమారు రూ.35 లక్షల నష్టం జరిగిందని జేసీకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన దుకాణదారులను ఆదుకునేలా కృషి చేయాలని తహసీల్దార్ ఉమాకాంత్‌రావు సమక్షంలో జేసీని కోరారు. దీంతో స్పందించిన జేసీ వెంకటేశ్వర్లు అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని జేసీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, టీఆర్‌ఎస్ నాయకులు ఎస్ తిరుపతి, ఎస్‌జీ సుభాష్, ఇతర దుకాణదారులు, వివిధ గ్రామాల వీఆర్వోలు పాల్గొన్నారు.

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...