తేల్..కమాల్..!


Wed,January 11, 2017 12:03 AM


నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : పం డుగలకు పిండి పదార్థాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పిండి పదార్థాల తయారీలో నూనెలను విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. సంక్రాం తి వచ్చిందంటే పదిరోజుల ముందు నుంచే అనేక రకాల పిండి పదార్థాలను ఇండ్లలో తయారు చేసుకుంటారు. కల్తీని అరికట్టాల్సిన అధికారులను లంచాలతో కల్తీ చేసి తమ దందాను యథేచ్ఛగా కొ నసాగిస్తున్నారు. కేవలం పండుగ వేళల్లోనే కాకుం డా నిత్యం ప్రతి ఇంట్లో నూనెల వాడకం తప్పనిసరిగా ఉంటుంది. ఇలాంటి నిత్యావసర వస్తువు నూ నెను కల్తీ చేయడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారు. హోటళ్లలో బొక్కల నూనెను వాడుతున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై దాడులకు రెండు నెలల క్రితం కార్పొరేషన్ అధికారులు సమాయత్తం అయ్యాయి. ఏం జరిగిందో కానీ మళ్లీ వెనకడుగు వేశారు.

అనుమతులు లేకుండానే ఆయిల్ మిల్లులు


ఆయిల్ మిల్లులు నడపడానికి కచ్చితంగా సివిల్ స ైప్లె అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కా నీ జిల్లాలో దాదాపుగా 20కి పైగా ఆయిల్ మిల్లులు ఉన్నప్పటికీ ఒక్క మిల్లుకు అనుమతి లేకపోవడం గమనార్హం. నగరంలో 5 భారీ,10 వరకు చిన్నతరహా నూనె మిల్లులు నడుస్తున్నాయి. బోధన్, ఆ ర్మూర్ పట్టణాల్లో కూడా 6 వరకు ఆయిల్ మిల్లులు ఉన్నాయి. ఇక్కడ సీజన్‌తో సంబంధం లేకుండా ని త్యం నూనె గానుగ పడుతారు. పల్లి, సన్‌ఫ్లవర్ వి త్తనాలతో నూనెను ఎక్కువ మొత్తంలో తీస్తారు. అ తి చౌకగా లభించే కాటన్ నూనె కూడా ఈ మిల్లు ల్లో తయారు చేస్తారు. ఆయిల్ తయారీలో కచ్చితమైన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. కా రణం ఆయిల్ వినియోగంతోనే రోగాలు తీవ్రస్థాయిలో వచ్చే ప్రమాదం పొంచి ఉంది. నగరంలోని గంజ్‌లో, గుర్బాబాది రోడ్డు, అంబర్‌పేట్, వీక్లీ మా ర్కెట్, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని స్టార్ హో టళ్ల ఏరియాలో, బోధన్ రోడ్డు ప్రాంతంలో ఆ యి ల్ మిల్లులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం జి ల్లాలో ఉన్న ఆయిల్ మిల్లులు కేవలం ప్యాకింగ్, రిఫిలింగ్ చేస్తున్నామనే పేరున నామమాత్రపు అ నుమతులు కొందరు పొందారు. దీని ముసుగులో ఆయిల్ తయారీ చేస్తున్నారనే విషయం బహి రంగ రహస్యమే.

కల్తీ ఎలా జరుగుతుందంటే...


ఆయిల్ మిల్లుల్లో విత్తనాలను గానుగ పట్టడం ద్వా రా నూనెలను తీస్తారు. ప్రధానంగా పల్లీ, సన్‌ఫ్లవర్ నూనెలను జిల్లాలోని ఆయిల్‌మిల్లుల్లో తీస్తున్నారు. శుద్ధిగా ఉండాల్సిన నూనెల్లో కల్తీ ఎక్కువగా చేస్తారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి భారీగా పల్లీ, సోయాబీన్, పొద్దుతిరుగుడు విత్తనాలను ఆయిల్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. కాటన్ విత్తనాలను మద్నూర్, నిర్మల్ జిల్లా బైంసా నుంచి దిగుమతి చేసుకుంటా రు. మిల్లుల వద్దే నూనెలు కల్తీ అవుతున్నాయి. నూ నె వ్యాపారులతో ముందుగానే ఒప్పందం ప్ర కారమే కల్తీ నూనెల తయారీ జరుగుతుందని తెలిసిం ది. పల్లీ, సన్‌ఫ్లవర్ నూనెల్లో అతి చౌకగా లభించే కాటన్ నూనెలను కలిపి కల్తీ చేస్తున్నారు. ఇలాంటి కల్తీ దందా అనేక ఏళ్లుగా జరుగుతుండగా పండు గల పూట మరింత మితిమీరి జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. కల్తీ నూనెల గుర్తించడం సామాన్య ప్రజలకు అంతగా తెలియదు. ధనవంతులు రిఫైండ్ ఆయిల్ వాడుతుండగా, తక్కువ ధరకు లభించే స్థానిక నూనెలను కొనుగోలు చే స్తున్న పేద, మధ్య తరగతి ప్రజలు కల్తీ నూనెకు బలి కావాల్సి వస్తోంది.

వ్యాపారులూ సిద్ధహస్తులే..


ఒకవైపు ఆయిల్ మిల్లుల్లో నూనె కల్తీ అవుతుంటే.. మరో వైపు రిటైల్‌గా మార్కెట్‌లో నూనెను విక్రయించే వ్యాపారులు కూడా కల్తీ చేయడంలో సిద్ధహస్తులే. ఇంటి వద్దనే నూనెలను కల్తీ చేసి విడిగా అమ్మడంతో పాటు చేతి మిషన్ సహాయంతో ఇం ట్లోనే ప్లాస్టిక్ కవర్‌లను తమకు నచ్చిన పేరు గల వాటిని తెప్పించుకుని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలో అనేక చోట్ల కేవలం నూనె విక్రయ దుకాణాలు పు ట్టగొడుగుల్లా వెలిశాయి. నిత్యం నూనె అవసరం ఉండడంతో తప్పని సరిగా ప్రజలు కొనుగోలు చే స్తారు. ఇలా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఆయిల్ మిల్లు యజమానులు, నూనె వ్యా పారులు కల్తీ నూనెలతో ప్రజలను దోచుకుంటూ అనారోగ్యం పాలు చేస్తున్నారు. దీనిపై వెంటనే అధికారులు ఆకస్మిక దాడులు జరిపి కల్తీని నిర్మూలించాల్సిన అవసరం ఉంది.

230
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS