కల్యాణలక్ష్మి అక్రమాలకు కళ్లెం


Wed,January 11, 2017 12:02 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : పే దింటి ఆడబిడ్డ పెళ్లి చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ భుజాన వేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేక బిడ్డల పెళ్లిళ్లు చేయని నిస్సహాయుల కుటుంబాలకు భరోసా కల్పించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసే కార్యక్రమానికి రెండేళ్ల క్రితమే ప్రభుత్వం శ్రీ కారం చుట్టింది. పేదింటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చుల కోసం రూ.51వేలను అందించి ఆదుకునే మహత్తర కార్యక్రమాన్ని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా చేపట్టింది. ఇటువంటి బృహత్తర పథకాన్ని అక్రమార్కులు వదలలేదు. బినామీ పే ర్లతో లక్షలాది రూపాయలు దోచుకున్నారు. రా ష్ట్రంలో పలుచోట్ల అక్రమాలు జరగగా, తొలిసారి నిజామాబాద్ జిల్లాలోనే వెలుగుచూశాయి. వెంటనే అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.పథకంలో లోపాలను సరిదిద్దేందు కు సీఎం కేసీఆర్ వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

పకడ్బందీగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అమలు జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ఇకపై అక్రమాలకు చోటులేకుం డా పోనుంది. ఇప్పటి వరకు ఉమ్మడి నిజామాబా ద్ జిల్లాలో 5987 మంది పేదింటి ఆడబిడ్డలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. కల్యాణ లక్ష్మి ద్వారా ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 1911 మందికి, మైనా ర్టీ ఆడబిడ్డలు 4076 మందికి రూ.51వేల నగదును ప్రభుత్వం అందజేసింది.

ప్రత్యేక చర్యలు ఎలా ఉన్నాయంటే...


కల్యాణలక్ష్మి పథకం ప్రారంభంలో కేవలం స్థానిక గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణతో పేదింటి ఆడబిడ్డకు రూ.51వేలు అందేవి. రెవెన్యూ అధికారులు ఇచ్చిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల తో పాటు పెళ్లినాటి ఫొటోలు, పెండ్లి కార్డులు జతచేసి అధికారులకు ఇస్తే చాలు. వెంటనే లబ్ధిదారులకు నేరుగా చెక్కు చేరేది. దీంతో ఇందులో అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఎంతో సులువుగా ఉండేది. ప్రధానంగా షాదీ ముబారక్‌లో ఆ ర్మూర్‌కు చెందిన ఓ మహిళ భారీఎత్తున అక్రమాలకు ఒడిగట్టింది. ఈ సంఘటన సంచలనం రేపిం ది. సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయికి చేరింది.

ఇలాంటి అక్రమాలకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా కొత్తగా చర్యలు చేపట్టబోనుంది. లబ్ధిదారులకు సకాలంలో సహాయం అందేందుకు గాను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే విధానం అమలు చేస్తోంది. ఆన్‌లైన్ ద్వా రానే ఇందుకు సంబంధించి ఆధార్‌కార్డును అప్‌లోడ్ చేసి దరఖాస్తుతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల ను కూడా ఆన్‌లైన్‌లోనే జత చేయాలి. అనంతరం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పక్కగా విచారణ చేపడతారు. లబ్ధిదారుల ఎంపిక భాద్యత రెవె న్యూ డివిజనల్ అధికారిపైనే ఉంటుంది. అంటే కిందిస్థాయి అధికారి నుంచి ఆర్డీవో వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో పాటు నిరక్ష్యరాస్యులైన కుటుంబాలకు రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ను ప్రభుత్వం పెట్టింది.

ఆర్మూర్‌లోఅక్రమాలు


షాదీముబారక్ పథకంలో అక్రమాలకు ఆర్మూర్‌లోనే అంకురార్పణ జరిగింది. 2015 సెప్టెంబర్ లో ఆర్మూర్ పట్టణానికి చెందిన నస్రీనా అనే అక్రమానికి ఒడిగట్టింది. ఆర్మూర్ పట్టణంలోని 36 మంది ముస్లిం పేద ఆడబిడ్డల పేరిట అక్రమంగా రూ.18లక్షల 36వేలను కాజేసింది. తప్పుడు ధ్రు వీకరణ పత్రాలను సృష్టించడంతో పాటు బ్యాం కుల్లో ఖాతాలను తీసింది. కొందరు అర్హులు కా గా, మరికొందరు అనర్హుల పేరున దరఖాస్తులను నస్రీనానే అధికారులకు ఇచ్చింది. ఇందుకు ఆర్మూర్‌కు చెందిన ఓ కౌన్సిలర్‌తో పాటు రెవెన్యూ అధికారులు సహకరించడంతోనే భారీ ఎత్తున అక్రమా లు జరిగాయి. విచారణ చేపట్టడంతో అవినీతి బట్టబయలైంది. అయితే ఇందులో పాత్ర ఉన్న రెవెన్యూ అధికారులను తప్పించడంలో అ ప్పటి ఉన్నతాధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వ్యక్తం అయినప్పటికీ, కేవలం వీఆర్వో సురేందర్ గౌడ్‌ను మాత్రమే సస్పెండ్ చేసి అధికారులు చే తులు దులుపుకున్నారు. అలాగే నిజామాబాద్ మండలంలోని ముదక్‌పల్లి, కాల్పోల్ గ్రామల్లో ఏడుగురి పేరున కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షల57వేలను ఇద్దరు వ్యక్తులు నొక్కేశారు. ఈ అక్రమార్కులపై కేసులు నమోదు చేసిన పోలీసులు, రిమాండ్‌కు తరలించగా జైలుపాలయ్యారు.

172
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS