వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య


Wed,January 11, 2017 12:02 AM

రెంజల్ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన బోయి భూమన్న(35) అనే వ్యవసాయ కూలీ క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు రెంజల్ ఎస్సై రవికుమార్ మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొంత కాలంగా కడుపు నొప్పి తో బాధ పడుతున్న భూమన్న రోగం నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంట పొలాలకు ఉపయోగించే క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తల్లి భూమన్నను చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించింది. చికిత్స పొందుతూ భూమన్న మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. భూమన్న భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

ఖండ్‌గాంలో ఒకరు..


శక్కర్‌నగర్ : బోధన్ మండలంలోని ఖండ్‌గామ్‌కు చెందిన బాలేరావు పోశెట్టి(30) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బోధ న్ రూరల్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలేరావు పోశెట్టి స్వగ్రామం నందిపేట్ మండలం కొ త్తూరు కాగా అక్కడ ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో జీవనోపాధిలో కోసం ఏడేళ్లుగా అత్తవారి ఊరిలో జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కొంత కాలంగా తాగుడుకు అలవాటు పడిన పోశెట్టి జీవితంపై విరక్తి చెంది అతను సోమవారం రాత్రి దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన వివరించారు. కాగా మృతుని భార్య అనిత అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించామని సీఐ శ్రీనివాసులు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS