భవనంపై నుంచి పడి బాలుడికి తీవ్ర గాయాలు

Wed,January 11, 2017 12:01 AM

నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని మిర్చికాంపౌండ్ ప్రాంతంలో మంగళవారం ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిన బాలుడు తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎం.డి.మాజీద్(10)అనే బాలు డు ఉదయం ఇంటి వద్ద భవనంపైకి ఎక్కి గాలి పటాన్ని ఎగరవేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు బాలుడు ఆటలో పడిపోయి వెనక్కి నడుచుకుంటూ వచ్చి భవనంపై నుంచి కిందపడిపోయాడు.ఈ ప్రమాదంలో బాలునికి తీవ్రమైన గాయాలవ్వడంతో కుటుంబీకులు, స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మాజీద్‌ను హైదరాబాద్ తరలించారు. ఈ సం ఘటనపై బాలుడి తల్లి ఎం.డి.నజియ సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

116
Tags

More News

మరిన్ని వార్తలు...