మెండోరాలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం

Wed,January 11, 2017 12:00 AM

మెండోరా : మండలంలోని ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో మంగళవారం మెండోరా మండల కేం ద్రం వద్ద గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం (62) లభ్యమైనట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానికులు గమనించడంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. శవంపై స్వెట్టర్, గోశి చీర ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని బాల్కొండ ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

214
Tags

More News

మరిన్ని వార్తలు...