ఎస్సైనంటూ యువతిని మోసం చేసిన కేటుగాడు

Wed,January 11, 2017 12:00 AM

నిజామాబాద్ క్రైం : యువతిని తన వలలో వేసుకునేందుకు నకిలీ ఎస్సై అవతారం ఎత్తాడు ఓ మోసగాడు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన జాల్న వంశీ ఓ యువతికి మా యమాటలు చెప్పి మోసం చేశాడు. అభంశుభం తెలియని ఆ యువతిని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్న కేటుగాడు సదరు యువతిని ఎలాగైన లోబర్చుకోవాలని పథకం రచించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా యువతికి పోలీసు అధికారిగా ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. అంతటితో ఆ గకుండా ఆమెకు మరింతగా చేరువయ్యేందు కు ఏకంగా ఎస్సై యూనిఫాం ధరించి, చేతిలో రివాల్వర్ పట్టుకొని ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగి వాటిని సదరు యువతికి పంపాడు.

ఇదంతా నిజమేనని నమ్మిన యువతి తాను పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని ఇంట్లో వారితో గొడవకు దిగింది. సదరు మోసగాడి వలలో పడిన తమ కూతురు బతుకు బజారు పాలు కాకుండా బాధిత తల్లి మంగళవారం సంబంధిత మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నగర సీఐ సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఎస్సై అవతారం ఎత్తిన వంశీని అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వంశీని రిమాండ్‌కు తరలించినట్లుగా మూడవ టౌన్ ఎస్సై టి.శ్రీహరి తెలిపారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...