ట్రాఫిక్ నింబంధనలు పాటించాలి

Wed,January 11, 2017 12:00 AM

ఇందల్‌వాయి(డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ):వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని నేషనల్ హైవే అథారిటీ పీడీ మీర్‌అహ్మద్ అలీ అన్నారు. మంగళవారం ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద 28వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్ర యాణికులు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. రోడ్డుపై ప్ర మాద సూచికలు ఉన్నచోట నెమ్మదిగా వెళ్లాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను ధరించాలన్నారు. రోడ్డు పక్కన ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేశామని తమ ప్లాజా ఆధ్వర్యంలో రోడ్డుపై ఎలాంటి ప్రమాదం జరిగి నా వెంటనే స్పందించి క్షతగాత్రులను జిల్లా కేం ద్రానికి తరలిస్తూ వారి ప్రాణాలను రక్షిస్తున్నామని తెలిపారు. అనతరం లారీ డ్రైవర్లకు సేఫ్టీ గార్డులు అందజేశారు. కార్యక్రమంలో ప్లాజా మేనేజర్ శ్రీనివాస్, ఇన్‌చార్జి పవన్‌కుమార్, చీఫ్ ఆపరేషన్ ఇన్‌చార్జి, శ్రీనివాస్ కృష్ణ, పీఆర్వో గణపతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...