నోటీసులు ఇవ్వండి..వేతనాలు ఆపేయండి


Wed,January 11, 2017 12:00 AM

మోర్తాడ్ : మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఫీల్డ్‌అసిస్టెంట్ల పనితీరుపై డ్వామా పీడీ వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఏలకు నోటీసులు ఇవ్వాలని, డిసెంబర్‌తో పాటు, జనవరి నెలల వేతనాలను నిలిపివే యాలని ఎంపీడీవో శ్రీనివాస్‌కు ఆదేశించారు. ఈ ప్రజావేదికలో హరితహారంలో నాటిన మొక్కలు అన్ని గ్రామాల్లో వేల సంఖ్యలో చనిపోయినట్లు తనిఖీ బృందం తెలిపింది. నాటిన మొక్కలను ఏమాత్రం పట్టించుకోని కారణంగానే అవి చనిపోయాయి. తనిఖీ బృందం చెప్పిన వెంటనే స్పందించిన పీడీ చనిపోయిన మొక్కల స్థానంలో వేరే మొ క్కలను వారం రోజుల్లోగా నాటించాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి నిధులు చెల్లించినట్లు ఉన్న పనులు మాత్రం పూర్తికాలేదని, కొన్ని అసలే ప్రా రంభం కాలేదని తనిఖీ బృందం వెల్లడించింది. ఈ నెల 20లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులన్నీ పూర్తి చేయించాలని లేకుండా శాఖాపరమైన చర్యలు త ప్పవని పీడీ హెచ్చరించారు.

గ్రామాల్లో నిర్మించిన మ్యాజిక్ సోక్‌పీట్‌ల నిర్మాణం లో కంకర వేయకున్న డబ్బులు చెల్లించారని, కా మన్ సోక్‌పీట్‌లను నిర్మించడంలో నిర్లక్ష్యం వహించారని తనిఖీ బృం దం తెలపగా, కంకర వేయని పీట్‌లలో కంకర వేయించాలని లేకపోతే అందుకు సంబంధించిన డబ్బులు మీ వేతనాల్లో నుంచి రికవరీ చేయాల్సి వస్తుందని పీడీ చెప్పారు. శెట్‌పల్లికి, ఏర్గట్లకు చెందిన మేట్లను తొలగించాలని ఆదేశించారు. ఫీల్డ్‌అసిస్టెంట్ల పనితీరులో అన్ని లొసగులను సామాజిక తనిఖీ బృందం బయటపెట్టిం ది. జాబ్‌కార్డులను అప్‌డేట్ చేయడం లేదని, జా బ్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న ఇవ్వడం లేదని, దరఖాస్తులు చేసుకున్న వారినుంచి డబ్బులు తీసుకుంటున్నారని, వందరోజులకు పై గా కూలీలకు పనికల్పించడం, సంతకాలు చేయకున్న కూలీ చెల్లించడం లాంటివి పీడీ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ముందు ఎటువంటి పొరపాట్లు చే యకుండా పని చేయాలని, పనిమీద ఆసక్తితో చేస్తే ఎటువంటి పొరపాట్లు జరగవని పీడీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు, ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లెడచిన్నయ్య, ఏపీవోనర్సయ్య పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS