ప్రతి ఓటు విలువ చాటి చెప్పడమే లక్ష్యం


Tue,January 10, 2017 11:59 PM

నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రజాస్వామ్య దేశంలో పాలకులను ఎన్నుకునేందుకు ఉన్న వజ్రాయుధం ఓటు హక్కు అని దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రా జేశ్ అన్నారు. మంగళవారం నుంచి జాతీయ ఓ టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ పోటీలు ప్రారంభమయ్యాయి. నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో తొలి రోజు 9వ తరగతి నుంచి ఇంటర్ వి ద్యార్థుల వరకు ప్రతి ఓటు విలువైనదే అనే అం శంపై చిత్ర లేఖన పోటీలను నిర్వహించారు.

300 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలను బుధవారం ప్రకటిస్తామని డీఈవో తెలిపారు. మధ్యాహ్నం 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు జూనియర్స్, సీనియర్స్ విభాగంలో ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్, మాక్ పార్లమెంట్, మాక్ అసెం బ్లీ పోటీలను నిర్వహించారు. 21వ తేదీ వరకు వివిధ పోటీలు కొనసాగుతాయని వివరించారు.

355
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS